Site icon NTV Telugu

విజయగర్జన సభకు అడ్డంకులు.. టీఆర్‌ఎస్‌ క్లారిటీ..!

ఈ నెల 29 వ తేదీన వరంగల్‌ జిల్లాలో విజయ గర్జన సభ నిర్వహించాలని అధికార టీఆర్‌ఎస్‌ భావించింది. ఇందులో భాగంగానే ఇవాళ హన్మకొండలోని దేవన్నపేటలో ఈ సభకోసం స్థలం పరిశీలించారు టీఆర్‌ఎస్‌ నాయకులు. ఈ నేపథ్యంలోనే.. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు మరియు అక్కడి రైతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్ కోసం పంట పండే తమ పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు.

దీంతో టీఆర్‌ఎస్‌ మరియు రైతుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఈ వివాదంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు.
సభ కోసం మూడు స్థలాలను పరిశీలిస్తున్నామని.. ప్రజల అంగీకారంతో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 29 వ తేదీన దీక్ష దివాస్ సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తెరాస, సీఎం కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు లేనిపోని ఆబండలు వేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల పునాదుల మీద సీఎం కేసీఆర్ తెరాస పార్టీ ని ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో నవంబర్29 దీక్షదివస్ ను నిర్వహించుకుంటున్నామని..ఈ సారి వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని వెల్లడించారు.

Exit mobile version