Site icon NTV Telugu

YS Sharmila : వైయస్ షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు

Ys Sharmila

Ys Sharmila

వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేస్తూ రాష్ట్రమంతా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. దీంతో నేడు అసెంబ్లీ సమావేశాల అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ను కలిసి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పలువురు ఎమ్మెల్యేలు వైఎస్‌ షర్మిలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వైఎస్‌ షర్మిల మంత్రులపై ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని స్పీకర్ నోటీసుకు తీసుకొచ్చారు ఎమ్మెల్యేలు.

 

నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పిన స్పీకర్. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రి నిరంజన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో షర్మిల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

 

 

Exit mobile version