Site icon NTV Telugu

Munugode Bypoll : అప్పుడే మొదలైన గులాబీ దండు సంబురాలు..

Trs

Trs

రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలకు సమయం రానే వచ్చింది. నేడు ఉదయం 8 గంటలకు మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 11 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. అయితే.. ఇంకా 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉండగానే దాదాపు తమ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. దీంతో.. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు చేస్తూ.. బాణసంచా పేల్చి, నృత్యాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు.

Also Read : Kunamneni Sambasiva Rao : కేసీఆర్ నాయ‌క‌త్వం ఈ దేశానికి అవసరం
అయితే.. ఇప్పటివరకు పోలైన ఓట్ల ప్రకారం.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 74,594 ఓట్లు సాధించగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 68,800 ఓట్లు.. పాల్వాయి స్రవంతి 16,280 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ 5794 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ కు 7,235, బీజేపీకి 5,877 ఓట్లు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం దిశగా పయనిస్తోన్న నేపథ్యంలో.. తెలంగాణ భవన్‌లో గులాబీ శ్రేణులు సంబరాలు పాల్గొనేందుకు కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకోనున్నారు.

Exit mobile version