NTV Telugu Site icon

Pak vs Ban: పాక్ టీంపై ఫన్నీ మీమ్స్.. చూసి నవ్వుకోండి!

Pak Vs Ban

Pak Vs Ban

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌ నైట్ స్కోరు 42/0తో (రెండో ఇన్నింగ్స్‌) మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. ఓపెనర్లు జకీర్‌ హసన్‌ (40), షాద్మాన్‌ ఇస్లామ్ (24), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34), ముష్పీకర్‌ రహీమ్ (22*), షకీబ్‌ అల్ హసన్ (21*) రాణించారు. పాక్‌ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆఘా సల్మాన్‌ తలో వికెట్ పడగొట్టారు.

READ MORE: Telangana: రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి రాజీనామా

కాగా.. పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. దీంతో సోషల్ మీడియాలో పాక్ ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ ఫలితాలు రాగానే సోషల్ మీడియాలో క్రియేటివ్ ఆర్టిస్టుల వెల్లువ వెల్లువెత్తింది. కొద్దిసేపటికే సోషల్ మీడియా ఫన్నీ మీమ్‌లతో నిండిపోయింది. మీరు వాటిని ఆనందించండి.

Show comments