Site icon NTV Telugu

Tisha : ఇది నిజామా.. త్రిష సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..?

trisha marriage

trisha marriage

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఈ అమ్మడు పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వస్తుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందని వార్తలు వైరల్ గా మారాయి… కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిందంటూ నెట్టింట వార్తలు హల్ చేస్తుంది..

ఇక త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది రియల్ లైఫ్ లో పెళ్లి అనుకుంటే పొరపాటే.. త్రిష ఓ జ్యూవెలరీ యాడ్ కి సంబంధించిన యాడ్లో పెళ్లి చేసుకుంది.. అది నిజమే అనుకోని దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఒక్కసారిగా ఆ వీడియోకి సంబంధించిన క్లిప్స్ చూసి నిజంగానే త్రిష పెళ్లి చేసుకుందేమో అంటూ షాక్ అయ్యారు. రీసెంట్ గా సౌత్ క్వీన్ త్రిష ప్రముఖ జ్యువెలరీ జీఆర్టీ జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది . ఈ బ్రాండెడ్ జ్యూవెలరీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తుంది . దీనికి సంబంధించి తాజాగా త్రిష ఓ యాడ్ లో నటించింది.అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..

ఈ యాడ్ లో త్రిష పెళ్లికూతురులానే కనిపిస్తుంది. పట్టు వస్త్రాలతో ఒంటి నిండా అద్భుతమైన నగలతో చూడచక్కగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే రాయల్ లుక్ లో అందరిని ఆకట్టుకునింది త్రిష . నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ళ అమ్మాయిల కనిపించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి . ఈ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఒక్కసారిగా ఈ యాడ్ చూసి షాక్ అయ్యారు.. అసలు నిజం తెలుసుకొని కూల్ అయ్యారు.. ప్రస్తుతం ఆ యాడ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. మీరు ఒకసారి ఆ యాడ్ వీడియో ను చూసేయ్యండి..

Exit mobile version