తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నటుడు విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ద్వారా డీఎంకేకు ప్రధాన పోటీదారుగా నిలుస్తానని ప్రకటించిన నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయ విమర్శల్లో భాగంగా నటి త్రిష పేరును ప్రస్తావించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్
అసలు ఏం జరిగింది అంటే.. రాబోయే ఎన్నికల్లో డీఎంకే.. తన పార్టీ మధ్యే అసలైన పోటీ ఉంటుందని, బీజేపీ రేసులో లేదని విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ తీవ్రంగా స్పందిస్తూ, విజయ్‌కు రాజకీయ అనుభవం సున్నా, “ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టు” ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు. అయితే కేవలం రాజకీయ విమర్శలతో ఆగకుండా ‘విజయ్ ముందుగా తన ఇల్లు దాటి బయటకు రావాలి, ముఖ్యంగా “త్రిష ఇంటి నుండి లేదా ఆమెతో ఉన్న బంధం నుండి” బయటపడితేనే ఆయనకు అసలైన రాజకీయ వాస్తవాలు తెలుస్తాయని నవ్వుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. తన పేరును ఇలా నీచమైన రాజకీయాల్లోకి లాగడంపై నటి త్రిష అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇంత అసభ్యంగా మాట్లాడతారని తాను ఊహించలేదని, తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని తన లీగల్ టీమ్ ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను అటు డీఎంకే ఎంపీ కనిమొళి వంటి ప్రత్యర్థులు కూడా ఖండిస్తూ, మహిళలను అగౌరవపరచడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించగా, నైనార్ నాగేంద్రన్ మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడం గమనార్హం.
