Site icon NTV Telugu

Tripti Dimri : షూటింగులో ఆ బాధ తట్టుకోలేక రోజూ ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని : తృప్తి దిమ్రీ

Tripti Dimri Dating News

Tripti Dimri Dating News

Tripti Dimri : ‘యానిమల్‌’ సినిమాలో ఓవర్ నైట్ నేషనల్ క్రష్ గా మారిపోయిన హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఆయన సినిమాలో తన అందచందాలతో యూత్‌ ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఇటీవల ‘బ్యాడ్‌ న్యూజ్‌’ అంటూ మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు నటన గురించి కొంచెం కూడా తెలియదన్నారు.

Read Also:Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. మరో మూడు రోజులు వానలు

‘చదువులో పెద్దగా రాణించలేకపోయాను. దీంతో మోడలింగ్ వైపు రావాలని అనుకున్నా. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబితే వారు ఒప్పుకోలేదు. అయినా పట్టుదలతో అడుగుపెట్టాను. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఫొటోగ్రఫీ డైరెక్టర్‌, పాయింట్‌ ఆఫ్‌ వ్యూ షాట్‌ అంటే ఏంటో తెలియదు. అప్పటికి నేను నటనలో కనీసం అఆఇఈలు కూడా నేర్చుకోలేదు. విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నా. తోటి నటీనటులతో కలిసి ప్రతీ సన్నివేశాన్ని చర్చించేదాన్ని. ఇండస్ట్రీకి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా అని ఎన్నోసార్లు ఆలోచించాను. ‘లైలా మజ్ను’ సమయంలో సెట్స్‌లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని. వాళ్లు చెప్పే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్లి పాత్ర డైలాగులు ప్రాక్టీస్‌ చేసేదాన్ని’ అంటూ కెరీర్‌ స్టార్టింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు.

Read Also:Tollywood : రాజేంద్రప్రసాద్ కు Jr .NTR, పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి

ప్రస్తుతం త్రిప్తి మూడు సినిమాలతో క్షణం కూడా తీరికలేకుండా బిజీగా ఉన్నారు. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విద్యాబాలన్‌, మాధురీదీక్షిత్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు ‘ధడక్‌ 2’ లోనూ ఆమె కనిపించనున్నారు.

Exit mobile version