Tribal clashes: ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని దక్షిణ ప్రావిన్స్ బ్లూ నైల్‌లో గిరిజన తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. గత రెండువారాలుగా జరుగుతున్న ఘర్షణల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లూ నైల్ ప్రావిన్స్‌లో గత కొన్ని నెలలుగా జాతి హింసతో అల్లాడిపోతోంది. జూలైలో చెలరేగిన గిరిజన ఘర్షణలు అక్టోబర్ ప్రారంభంలో 149 మంది చనిపోయారు. గత వారం మరో 13 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. భూవివాదంపై రెండు జాతుల మధ్య తొలుత వివాదం ఏర్పడింది. దీంతో వివాదం చిలికిచిలికి గాలివానలా మారి హింస చెలరేగింది. గత సంవత్సరం సైనిక తిరుగుబాటు తర్వాత సూడాన్‌లో హింసాత్మక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
FATF Pakistan: దాయాది పాక్‌కు ఊరట.. నాలుగేళ్ల తర్వాత గ్రే లిస్ట్ నుంచి తొలగింపు
జులైలో హౌసా, బెర్జా తెగల మధ్య చెలరేగిన భూవివాదం ఘర్షణలకు దారి తీసింది. దక్షిణ సూడాన్‌లోని కోర్డోఫాన్, ఇతర ప్రాంతాలు గత దశాబ్దంలో గందరగోళం, సంఘర్షణలతో అల్లాడిపోతున్నాయి. ఒమర్ అల్-బషీర్ మూడు దశాబ్దాల నిరంకుశ పాలన తర్వాత గత అక్టోబర్‌లో తిరుగుబాటుతో సూడాన్ గందరగోళంలో పడింది. 2019లో ప్రజల తిరుగుబాటుతో అతని ప్రభుత్వం పడిపోగా… అనంతరం పౌర-సైనిక భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది.
