NTV Telugu Site icon

Transgender Pregnant: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి

Trans Sixteen

Trans Sixteen

ట్రాన్స్‌జెండర్‌ల పెళ్లి ఎలా ఉన్నా వారికి మాతృత్వ, పితృత్వ ఆనందం మాత్రం దక్కే అవకాశం చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశాన్ని, జీవితంలో పిల్లలు పుడితే కలిగే ఆనందాన్ని పొందింది ఓ ట్రాన్స్‌జెండర్ జంట.కేరళకు చెందిన జియా, జహద్​ దంపతులు పండంటి బిడ్డను కన్నారు. దీంతో వీరు దేశ చరిత్రలోనే బిడ్డకు జన్మనిచ్చిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్​ జంటగా నిలిచారు. దేశంలో తొలిసారిగా వింత సంఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు కలిసి సృష్టికి భిన్నంగా తల్లిదండ్రులయ్యారు. కేరళకు చెందిన ఈ ట్రాన్స్​ జెండర్​ జంట బుధవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెగా మారిన అతడు వెల్లడించాడు.

Also Read: ICC T20 Rankings: నెంబర్‌వన్‌కు చేరువలో హార్దిక్ పాండ్యా..గిల్‌ దూకుడు

ఇటీవలే జియా తన ఇన్​స్టాగ్రామ్​లో జహద్​ 8 నెలల గర్భవతి అని.. మార్చి 4న బిడ్డకు జన్మనిస్తుందని పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే అనుకున్న తేదీ కంటే ముందుగానే కోజికోడ్ మెడికల్​ కాలేజీ వైద్యులు జహద్​కు సిజేరియన్​ చేశారు. దీంతో బుధవారం ఉదయం 9:30 గంటలకు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని జియా తెలిపారు.

బిడ్డకు జన్మనివ్వడం పట్ల ట్రాన్స్​జెండర్​లు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్ అయిన ఆడమ్ హ్యారీ కూడా.. తన జీవితంలో ఇంతటి ఆనందాన్ని అనుభవించలేదని జియా అన్నారు. అయితే వారిని పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. జహద్​ తన బిడ్డకు పాలిచ్చే వీలు లేనందున.. ఆస్పత్రి పాల బ్యాంక్​ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు వైద్యులు. తల్లిదండ్రులైన వీరికి పలువురు అభినందనలు తెలిపారు.

Also Read: Nani: వ్యాలెంటైన్స్ డేకి ‘హార్ట్ బ్రేక్’ని ఎంజాయ్ చేద్దాం…