Site icon NTV Telugu

తెలంగాణలో 19మంది డీఎస్పీ ల బదిలీలు

తెలంగాణ పోలీస్‌ శాఖ లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం లో 19 మంది డీఎస్పీ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ లో పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌ లో ఉన్న జి. హనుమంత రావును కూకట్‌ పల్లి ట్రాఫిక్‌ ఏసీపీ గా బదిలీ చేశారు. ఇక ఇప్పటి వరకు కూకట్‌ పల్లి ట్రాఫిక్‌ ఏసీపీ గా ఉన్న ఏ. చంద్ర శేఖర్‌ ను కూకట్‌ పల్లి ఏసీపీ గా నియామకం చేశారు. అలాగే.. కూకట్‌ పల్లి ఏసీపీ గా ఉన్న బి. సురేంద్ర రావు సైబరాబాద్‌ ఏసీపీ మరియు ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే ఇబ్రహీం పట్నం ఎస్పీగా ఉన్న యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్‌ లో.. జగిత్యాల ఏస్డిపీఓ గా ఉన్న పీ. వెంకట రమణ, చౌటుప్పల్‌ ఏసీపీ గా ఉన్న పి. సత్తయ్య, గద్వాల డీఎస్పీ ఏ యాదగిరిని చీఫ్‌ ఆఫీస్‌ లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version