NTV Telugu Site icon

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మందికి గాయాలు

Accident

Accident

Road Accident: జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉండవల్లి మండలంలో శనివారం ఉదయం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లారీని ఒకదాని తరువాత ఒకటి ఢీకొనడం వల్ల సంభవించింది. ప్రమాద సంగీతనకు సంబంధించిన వివరాలు ప్రకారం, ముందుగా బండల లారీ యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుండి కడప వెళ్ళిపోతున్న సిజిఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వెంటనే వెనక నుంచి మరో ట్రావెల్స్ బస్సు, హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళిపోతున్న కావేరి ట్రావెల్స్ బస్సు కూడా ఢీకొనింది.

Also Read: Union Budget 2025: కేంద్ర బడ్జెట్ పై ప్రజా అంచనాలు ఎలా ఉండనున్నాయంటే!

ఈ ప్రమాదంలో, కావేరి ట్రావెల్స్ బస్సులో ఉన్న 40 మంది గాయపడగా.. వారిలో నలుగురికి గాయాల పరిణామం తీవ్రంగా ఉందని సమాచారం. ఘటనలో బస్సు డ్రైవర్‌కు కాలు విరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలోని క్షతగాత్రులను వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన తర్వాత పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.