మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. ఉపేందర్ – శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు..మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చారు దుండగులు. మనీష్ (6) అనే బాలుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. ఉరి బిగించి హత మార్చినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల రోజుల క్రితం ఈ బాలుడి పై దుండగులు హత్యాయత్నం చేయగా వారి ప్రయత్నం విఫలమైనట్లు బాధిత కుటుంబం తెలిపింది..
Also Read:Tirumala : తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
మొదటి సారి ప్రాణలతో బయటపడ్డ మనీష్.. రెండవ సారి ఉరి నుండి తప్పించు కోలేకపోయాడని విలపించారు.. ఇదే ఏడాది జనవరిలో నిహల్ అనే 4 ఏండ్ల బాలుడు సంపులో పడి మృతి చెందాడు.. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల వరుస మరణాలతో కుటుంభికులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల వరుస మరణాల పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. చిన్నారుల హత్యకు గల కారణాల ఏమిటీ? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
