Gujarat: గుజరాత్ లో విషాదం.. నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. బోతాద్ జిల్లాలోని కృష్ణసాగర్ లేక్‌లో పడి ఐదుగురు టీనేజర్లు శనివారం మృతి చెందారు. తొలుత నీళ్లల్లో దిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలురు నీట మునిగిపోయారు. మృతులు అందరూ 16-17 ఏళ్ల వారేనని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది.
Read Also:Kondagattu: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. మాలదారులతో కిటకిటలాడుతున్న ఆలయం
Also Read
- Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
- Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలోని ఓగ్రామానికి చెందిన 16-17 ఏళ్ల వయస్సు ఇద్దరు బాలులు కృష్ణసాగర్ సరస్సులో ఈత కొట్టేందుకు శనివారం మధ్యాహ్నం వెళ్లారు. అయితే నీటిలో దిగి ఈత కొడుతున్న సమయంలో ఇద్దరు బాలులు అందులో మునిగిపోయారు. దీనిని గమనించిన మరో ముగ్గురు పిల్లలు వారిని కాపాడాలనే ఉద్దేశంతో నీటిలో దూకారు. కానీ వారికి కూడా పెద్దగా ఈత రాకపోవడంతో ఆ ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు. వీరి వయస్సు కూడా 17 సంవత్సరాల లోపే ఉంటుంది.
Read Also:Simran Kaur Mandi: బాత్ రూం నుంచి బయటికి వచ్చావా పిల్ల.. బట్టలు మర్చిపోయావ్
ఈ ఘటనపై పోలీసులకు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. కానీ పిల్లలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు బోటాడ్ ఎస్పీ కిశోర్ బలోలియా మీడియాకు తెలిపారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!