Site icon NTV Telugu

Tragedy: పండగ పూట తీవ్ర విషాదం.. స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి

Tragedy

Tragedy

హోలీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసమని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నాలుగు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: Harish Rao: ఏ రైతును చూసినా.. ఆవేదన.. కన్నీళ్లే కనిపిస్తున్నాయి

మరోవైపు.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తానిమడుగు వద్ద లిఫ్టు ఇరిగేషన్ కాల్వలో స్నానానికి వెళ్ళిన మరో యువకుడు మృతి చెందాడు. మృతుడు జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన కార్తిక్ గా గుర్తించారు.

Read Also: Naga Chaitanya: ప్రేక్షకుల్ని వణికించిన డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టిన చైతూ

ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా హోలీ వేడుకల్లో పలుచోట్ల ప్రమాదాలకు దారితీసింది. ఆనందంగా గడపాల్సిన కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. హోలీ వేడుకలు జరుపుకుని ఈతకు వెళ్లిన పలువురు యువకులు గల్లంతు కాగా.. మరోచోట హోలీ వేడుకలకు వెళుతున్న భార్యభర్తలు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇంకోచోట వాటర్ ట్యాంక్ పగలి యువతి పై పడటంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలు వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version