RCB Celebrations: ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచిన నేపథ్యంలో బెంగళూరులో ఘనంగా సంబరాలు నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేసారు. అయితే ఆ వేడుక కాస్త విషాదం నింపింది. జట్టు సభ్యులు విజయోత్సవం కోసం నగరానికి చేరుకున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియకు భారీగా అభిమానులు చేరుకున్నారు. గేట్-6 వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడడంతో తొక్కిసలాట చోటుచేసుకొవడంతో ఇద్దరు RCB అభిమానులకు తీవ్ర గాయలయ్యాయి. ఇందులో ఆరుగురు మరణించారు.
Read Also: Auto Driver: వాటే ఐడియా సర్‌జీ.. ఆ చిన్న పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!
అలాగే ఈ ఘటనలో 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే బాధితులను శివాజినగర్ లోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, తొక్కిసలాట సమయంలో బ్యారికేడ్లు కూలిపోవడంతో ముగ్గురి కాళ్లు విరిగాయి. మరో ఆరుగురికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. స్టేడియం వెలుపల జనసమూహం కూడా భారీగా ఉండటంతో, ఆ మార్గంలో వెళ్లే వాహనాలు ముందుకు కదలలేక ట్రాఫిక్ జామ్ అయింది. జనసమూహాన్ని నియంత్రించలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తొక్కిసలాటలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడిన వారిని తమ జీపులో ఆసుపత్రికి తరలించారు.
Read Also: RCB Victory Parade: బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ.. స్వాగతం పలికిన కర్ణాటక డిప్యూటీ సీఎం
RCB విజయం తరువాత అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతుండగా ఇలాంటి విషాదకర ఘటన జరగడం అందరినీ కలచివేసింది. ఆటగాళ్లను చూడాలని స్టేడియం వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరడం వల్ల వేదిక వద్ద భారీగా జనం రావడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో నియంత్రణ కోల్పోయిన పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగింది.
