NTV Telugu Site icon

Bengaluru Traffic: ట్రాఫిక్‌ కష్టాలు.. కారులోనే వంటకి రెడీ?

Bangalore

Bangalore

కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో  2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇది చూస్తుంటే బెంగళూరులో ట్రాఫిక్ తారాస్థాయికి చేరుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీనికి అద్దం పట్టే ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజెప్పే రెండు ఘటనలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఘటనలో ట్రాఫిక్ జామ్  లో ఇరుక్కున్న ఓ మహిళ అక్కడే కూరగాయలు కూడా ఒలుచుకుంది.

Also Read: ICC World Cup: సరికొత్త హంగులతో.. ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!

ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన నిరసనను తెలియజేసింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ట్రాఫిక్‌లో వంట కూడా చేసుకోవచ్చని వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు. మరో ఘటనలో బెంగుళూరు ట్రాఫిక్ లో చిక్కుకున్న వ్యక్తికి గూగుల్ నుంచి ఓ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ‘మీ షాపింగ్‌ అనుభవం ఎలా ఉంది?’ అని ఉంది. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్‌మాల్‌ పక్కన ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోవడంతోనే ఈ మెసేజ్ వచ్చింది. అంటే ఆయన షాపింగ్ చేసే అంత టైం ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలా బెంగళూరు వాసులు సగం జీవితం ట్రాపిక్ లోనే అయిపోతుంది. అధికార పక్షం, ప్రతిపక్షాలు తమ పదవుల కోసం, ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే ఇలాంటి కష్టాలు కొంచెం అయినా తగ్గుతాయని, వీటి మీద శ్రద్ద చూపాలని ప్రజలు మండిపడుతున్నారు.