Toyota Land Cruiser FJ: టయోటా అత్యంత చౌకైన ల్యాండ్ క్రూయిజర్ FJ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే?

  • ల్యాండ్ క్రూయిజర్ FJ విడుదల
  • థాయిలాండ్‌లో THB 12.69 లక్షల ధరకు విడుదల
  • భారతీయ రూపాయలలో సుమారుగా రూ. 36 లక్షలకు సమానం
Toyota Land Cruiser Fj

Toyota Land Cruiser Fj

టయోటా థాయ్‌లాండ్‌లో కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని విడుదల చేసింది. ఈ SUVలో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, బాడీ క్లాడింగ్, టెయిల్‌గేట్ స్పేర్ టైర్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏడు-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-జోన్ ఆటో ఏసీ, ఆటో-డిమ్మింగ్ IRVM, 2.5-అంగుళాల ఎయిర్ ఫిల్టర్ ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ వ్యూ మానిటర్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్లు, TPMS, ADAS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read:8th Pay Commission: గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్‌లో జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం.. బకాయిలు రూ.15 లక్షలు

తయారీదారు ఈ SUVలో 2.7-లీటర్ల పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 166 PS పవర్, 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జత చేశారు. ఈ SUV 4WD, డిఫరెన్షియల్ లాక్‌ను కూడా అందిస్తుంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని థాయిలాండ్‌లో THB 12.69 లక్షల ధరకు విడుదల చేసింది, ఇది భారతీయ రూపాయలలో సుమారుగా రూ. 36 లక్షలకు సమానం. ఇది 2026 చివరి నాటికి భారతదేశంలో విడుదల అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.