Site icon NTV Telugu

Toxic Movie Teaser: ‘టాక్సిక్‌’ టీజర్‌కు సర్టిఫికేట్అవసరం లేదన్న సెన్సార్ బోర్డు!

Toxic Movie Teaser

Toxic Movie Teaser

Toxic Movie Teaser: స్టార్ హీరో యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌’. ఈ సినిమా షూటింగ్ దశలోనే సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’ మూవీ టీజర్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇదే టైంలో టీజర్‌‌పై తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్‌లోని కొన్ని సన్నివేశాలపై పలువురు రాజకీయ నాయకులు, మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాపై వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

READ ALSO: Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!

ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా టీజర్‌లో అశ్లీలత ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉషామోహన్ మాట్లాడుతూ.. టీజర్‌లోని కొన్ని దృశ్యాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆమె కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ, వెంటనే ఆ టీజర్‌ను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ సభ్యులు.. టీజర్‌లో ఉన్న వివాదాస్పద దృశ్యాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) కు లేఖ రాశారు.

మహిళా కమిషన్ లేఖపై స్పందించిన సీబీఎఫ్‌సీ (CBFC) వివరణ ఇస్తూ.. “డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ (YouTube వంటివి) మా పరిధిలోకి రావు. థియేటర్లలో ప్రదర్శించే టీజర్లు, ట్రైలర్లకు మాత్రమే సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ తప్పనిసరి. ‘టాక్సిక్‌’ టీజర్ నేరుగా యూట్యూబ్‌లో విడుదలైనందున దానికి సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదు.” అని బోర్డు వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కంటెంట్ సర్టిఫికేషన్ కోసం తమ వద్దకు రాలేదని కూడా బోర్డు స్పష్టం చేసింది. ఏది ఏమైనా సెన్సార్ బోర్డు ఇచ్చిన వివరణతో ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్‌కు ఒక రకంగా ఊరట లభించినట్లయింది.

READ ALSO: Sankranti Pindi Vantalu: ఈ పండుగకు సింపుల్‌గా.. షార్ట్ టైంలో చేసుకునే 5 రకాల పిండి వంటలు ఇవే..

Exit mobile version