Site icon NTV Telugu

Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’

Toxic Vs Dhuradhar 2

Toxic Vs Dhuradhar 2

కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. నిజానికి ఈ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ అరబ్ కంట్రీస్ లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు కారణంగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ధురంధర్  బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న విధ్వంసం చూస్తుంటే టాక్సిక్ టీమ్ వాయిదా నిర్ణయం తీసుకోవడమే ఉత్తమమనిపిస్తోంది. ఎందుకంటే ‘ధురంధర్ 2’ దెబ్బకు ఏ సినిమా అయినా నిలదొక్కుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం.

Also Read : Dhurandhar : The Revenge : ‘ధురంధర్’ విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు.. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం!

 టాక్సిక్ చిత్రం పాన్-ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది. ఇలాంటి పెద్ద చిత్రానికి సోలో రిలీజ్ మరియు భారీ స్థాయిలో థియేటర్లు అవసరం. కానీ ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న ‘మాస్ రాంపేజ్’ వల్ల థియేటర్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా మిడిల్ ఈస్ట్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల కూడా విదేశీ వసూళ్లపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే రిస్క్ తీసుకోకుండా సినిమాను వాయిదా వేయడం మేకర్స్ తెలివైన నిర్ణయంగా భావించవచ్చు.అయితే, సినిమాను జూన్ 4కి వాయిదా వేసినప్పటికీ, ప్రస్తుతం ఈ చిత్రంపై ఆశించిన స్థాయిలో ‘బజ్’ లేదు. యష్ వంటి పెద్ద స్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి. కానీ, ప్రమోషన్ల విషయంలో టాక్సిక్ టీమ్ ఇంకా వేగం పెంచాల్సి ఉంది. జూన్ 4న సోలో రిలీజ్ దొరికినప్పటికీ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఇప్పటి నుంచే ప్రమోషన్ల హోరు మొదలుపెట్టాలి. జూన్ 4న టాక్సిక్ చిత్రానికి సోలో రిలీజ్ లభించనుంది. ఐపీఎల్ హడావుడి కూడా అప్పటికి ముగిసిపోతుంది కాబట్టి, వసూళ్లకు మంచి అవకాశం ఉంటుంది. అయితే, అప్పటివరకు ప్రేక్షకుల ఆసక్తిని కాపాడటం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. రికార్డులు తిరగరాయాలంటే మాత్రం ప్రమోషన్లలో ‘టాక్సిక్’ డోస్ పెరగాల్సిందే!

Exit mobile version