Lunar Eclipse: సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి ఒక సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ గ్రహణం శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలలో.. కుంభరాశిలో జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుందని పండితులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 7న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:37 గంటలకు ప్రారంభమై, 11:41 గంటలకు మధ్యస్థితిని చేరుకుని, సెప్టెంబర్ 8న అర్ధరాత్రి 1:31 గంటలకు ముగియనుంది. ఈ గ్రహణం కుంభరాశిలో జరగనుండటంతో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశముంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు, ధననష్టం సంభవించే అవకాశం ఉంది.
IP68 రేటింగ్, ప్రీమియం ఫీచర్లతో Samsung Galaxy Tab S11, S11 Ultra లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
అలాగే మీనరాశి వారికి కోపం, అపనిందలు, అనవసర ఖర్చులు, దూర ప్రయాణాలు కలుగవచ్చు. ఇక కర్కాటకరాశి వారికి ఆరోగ్య సమస్యలు, ప్రతిష్టా భంగం, గృహ-వాహన సంబంధ పనుల్లో ఆలస్యాలు ఎదురవచ్చు. వీరితోపాటు వృశ్చికరాశి వారు మానసిక అసాంతృప్తి, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందువల్ల పై రాశుల వారు దీపావళి వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
గ్రహణ సమయంలో గర్భిణులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పండితుల సూచన ప్రకారం దర్భ (గరిక)ను దగ్గర ఉంచుకోవాలి, నిద్రించే స్థలంలోనూ ఉంచాలి. సాయంత్రం 6 గంటలలోపు భోజనం పూర్తి చేయాలి. ఆహార పదార్థాలు, పూజా గదిలో కూడా దర్భలను ఉంచాలి. గ్రహణం ముగిసిన తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. గ్రహణం తర్వాత శాంతి కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని పండితుకు సూచిస్తున్నారు.
ఇందులో భాగంగా హోమం చేయడం, దానం చేయడం, చంద్ర, రామ, రజిత ప్రతిమల దానం చేయడం వంటివి ఉన్నాయి. అదేవిధంగా తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం కూడా శాంతి ఫలితాలను అందిస్తుంది. ఈ విధంగా సూచించిన జాగ్రత్తలు, పరిహారాలను పాటించడం ద్వారా గ్రహణం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టవచ్చని చెబుతున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించడం, శాంతి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణులు పండితుల సూచనలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.
