Site icon NTV Telugu

Heavy Rains: గుజరాత్లో దంచికొడుతున్న వానలు.. వరదల దాటికి నీటమునిగిన కార్లు

Gujarat Rains

Gujarat Rains

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో వర్షం, వరదల బీభత్సం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇప్పుడు గుజరాత్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. నేడు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్‌, సూరత్, గిర్‌ సోమనాథ్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల దాటికి కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు మునిగిపోయాయి.

Bro Movie Censor Talk: హమ్మయ్య ‘బ్రో ది అవతార్’ సెన్సార్ పూర్తి.. ఇక రచ్చకి రెడీ అవ్వండమ్మా!

గుజరాత్‌లో నేడు ఉదయం 6 గంటల నుంచి దాదాపు 14 గంటల్లోనే గిర్ సోమనాథ్ జిల్లాలోని సుత్రపడ తాలూకాలో అత్యధికంగా 345 మీమీ వర్షపాతం సంభవించింది. రాజ్‌కోట్‌లోని ధోరాజీ తాలూకాలో 250 మీ.మీ వర్షపాతం నమోదు కాగా.. కేవలం రెండు గంటల్లోనే 145 మీమీ వర్షం కురిసింది. మరోవైపు దక్షిణ గుజరాత్ లో రానున్న మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వర్షాల ధాటికి గుజరాత్‌లో పలు ప్రాంతాల్లో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై వర్షపు నీరుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల దృష్ట్యా కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో 43 రిజర్వాయర్లకు అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత విపత్తు నిర్వహణ శాఖా కూడా అలర్ట్ అయింది.

Exit mobile version