NTV Telugu Site icon

Gym Viral Video: శారీలో సూపర్‌గా వర్కౌట్స్.. యువతి కన్ను గీటుకు పడిపోవాల్సిందే!

Woman Saree Zym

Woman Saree Zym

Video of Woman’s Gym Workouts in Saree: సాధారణంగా జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరు ప్రత్యేక డ్రెస్ వేసుకుంటారు. వర్కౌట్స్ చెయ్యడానికి సులువుగా ఉండే జిమ్‌ డ్రెస్‌లను అందరూ వేసుకుంటుంటారు. జిమ్‌కు వెళ్లేప్పుడు జీన్స్, శారీ ధరించడం చాలా చాలా అరుదు. అయితే ఓ యువతి శారీలో జిమ్‌కు వెళ్లింది. వర్కౌట్స్ చేస్తున్న ఆమెను చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా ఓ అందమైన యువతి శారీలో జిమ్‌కు వెళ్లింది. అక్కడ శారీలోనే ఆమె వర్కౌట్స్ చేసింది. షోల్డర్, లెగ్‌కు సంబందించిన ఎక్సైజ్‌లను చీరలో చాలా సులువుగా చేసింది. శారీలో వర్కౌట్స్ చేసిన ఆ యువతి.. జిమ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే యువతి చేసిన వర్కౌట్స్ కంటే.. ఆమె కన్ను గీటడం ప్రత్యేకంగా నిలిచింది. లవర్స్ డే సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కంటే కూడా అందంగా కన్ను గీటడం విశేషం.

Also Read: Viral Video: ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కిన సాక్షి.. వీడియో వైరల్!

యువతి వర్కౌట్స్, కన్ను గీటడంకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోని ‘вєαυту qυєєηѕ н∂’అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘సూపర్‌ వర్కౌట్స్’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ప్రియా ప్రకాష్ వారియర్ కంటే అందంగా కన్ను గీటారు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. గతంలో రీనా సింగ్ అనే యువతి చీరలో జిమ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

https://x.com/Lovely_Queens1/status/1809575845243043930

Show comments