తక్కువ వర్షపాతం నమోదు కారణంగా పెరగనున్న ద్రవ్యోల్బణం
ఈ వానాకాలంలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దీని వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. తక్కువ వర్షపాతం, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కేర్ రేటింగ్స్ తన నివేదికలో కరోనా మహమ్మారి తరువాత, ప్రభుత్వ సబ్సిడీ తగ్గింపు ప్రభావం గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్‌పై కనిపిస్తుంది. దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం తగ్గుతుంది. అస్థిరమైన రుతుపవనాలు, ఆహార ధరలు, గ్రామీణ డిమాండ్ అనే శీర్షికతో కేర్ రేటింగ్స్ నివేదికను విడుదల చేసింది. ఇందులో రుతుపవనాల హెచ్చుతగ్గుల కారణంగా దేశీయ ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ పరిస్థితి ద్రవ్యోల్బణం అగ్నికి ఆజ్యం పోస్తుంది.
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 270 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం బంగారం రేటు ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,200లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,670గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.
రైతులకు గుడ్ న్యూస్.. వర్షం కారణంగా పంట నష్టపోయిన వారికి రూ.86కోట్లు విడుదల
ఈ ఏడాది దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి పంజాబ్‌లో వరుణుడు భారీ వర్షం కురిపించాడు. దీంతో పలు జిల్లాల్లో వరద బీభత్సం నెలకొంది. నగరాలు కూడా జలమయమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విశేషమేమిటంటే పంజాబ్‌లో అధిక వర్షాల కారణంగా చాలా మంది రైతులు నష్టపోయారు. లక్షల హెక్టార్లలో సాగు చేసిన వరి పంట నాశనమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మళ్లీ వరి నాట్లు వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పంట నష్టపోయిన రైతులకు పంజాబ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రైతులకు ఎకరాకు రూ.6,800 చొప్పున నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి హేమంత్ మాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం 86 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది. త్వరలోనే పరిహారం సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. అయితే జూలై నెలలో ప్రభుత్వం రైతుల ఖాతాలో రూ.103 కోట్లు పరిహారంగా విడుదల చేసింది.
గంటలోపే ‘సోల్డ్ అవుట్’ బోర్డు.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ మాములుగా లేదు!
భారత్ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూసిన చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. టికెట్ల కోసం మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రయత్నించిన అభిమానుల్లో ఎక్కువ మందికి ‘సోల్డ్ అవుట్’ బోర్డు కనిపించింది. ‘మీరు క్యూలో ఉన్నారు.. దయచేసి వేచి ఉండండి’ అని రాత్రి వరకు చూపించింది. చివరకు సోల్డ్ అవుట్ అనే బోర్డు పడింది.
‘మాస్టర్ కార్డ్’ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి ‘బుక్ మై షో’లో భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లు అందుబాటులో ఉంచారు. గంటల వ్యవధిలోనే ఆ మ్యాచ్‌ల టికెట్లు ఖతం అయ్యాయి. అన్ని లీగ్ మ్యాచ్‌లకు కూడా ‘సోల్డ్ అవుట్’ అనే చూపిస్తోంది. బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు భారత లీగ్ మ్యాచ్‌లకు అభిమానుల కోసం దశల వారీగా టికెట్లు అమ్ముతారు.
ఢిల్లీలో జీ-20 సదస్సు.. కోతులను తరిమేందుకు అధికారుల పాట్లు
ఈ ఏడాది భారత్ లో జీ-20 కూటమి సమావేశాలు జరనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. అయితే ఈ సమావేశాలకు కోతులు ఇబ్బందికరంగా మారాయి. ఢిల్లీలో సాధారణంగా కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో ఉన్న చారిత్రక ప్రదేశాలలో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటి వల్ల ఇబ్బంది కూడా పడ్డారుు. అయితే జీ-20 సమావేశాలను భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా వీటి వల్ల ఎవరికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతుంది. జీ-20 సమావేశాల సందర్భంగా విదేశీ అతిధులకు కోతుల వల్ల ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసేందుకు న్యూఢిల్లీమున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సిద్ధమైంది. అటవీ శాఖ సిబ్బందితో కలిసి చర్యలు ప్రారంభించింది. జీ-20 సమావేశాలు జరిగే వేదిక వద్ద, విదేశీ అతిధులు ఉండే హోటల్స్ వద్ద విదేశీ అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
సెప్టెంబర్ 5 నుంచి పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్
సెప్టెంబర్ 5 నుంచి పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ TS: సెప్టెంబర్ 5 నుంచి PG ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం SEP 5 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 23న ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 26న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 29లోగా తమకు వచ్చిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అటు అక్టోబర్ 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. సెప్టెంబరు 26న మొదటి విడత పీజీ సీట్లను కేటాయించనున్నట్టు కన్వీనర్ పాండురంగారావు తెలిపారు. సెప్టెంబరు 29లోగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందన్నారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబరు 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ హెచ్, మహిళా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఈడీ తదితర 66 పీజీ కోర్సుల్లో ప్రవేశాలను భర్తీ చేస్తారు.
జీ20 శిఖరాగ్ర సమావేశం.. ముస్తాబవుతున్న ఢిల్లీ మెట్రో
ఇండోనేషియా తర్వాత ఈ ఏడాది జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సమ్మిట్ తేదీలు సమీపిస్తున్న తరుణంలో జి20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ నగరం సిద్ధమైంది. ప్రపంచ ప్రఖ్యాత ఢిల్లీ మెట్రో కూడా G-20 సమ్మిట్‌కు సిద్ధమైంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) G20 లోగో, థీమ్‌ను ప్రదర్శించడం ద్వారా ప్రధాన స్టేషన్‌లను సుందరీకరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ మెట్రోలోని పలు స్టేషన్లు రూపాంతరం చెందనున్నాయి. శిఖరాగ్ర వేదిక సమీపంలోని సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల కోసం DMRC ఒక పాదచారుల ప్లాజాను అభివృద్ధి చేసింది. సీటింగ్, లైటింగ్‌ల ద్వారా ఈ స్థలాన్ని చక్కగా అందంగా తీర్చిదిద్దారు.
తెలంగాణ సర్కార్ మరో శుభవార్త.. అర్చకుల జీతం రూ.10 వేలకు పెంపు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేసీఆర్ ప్రభుత్వం తీపి కబురు చేప్తూనే ఉంది. ఇప్పుడు పూజారులు శుభవార్త విన్నారు. ధూప దీప నైవేద్య పథకం కింద అర్చకులకు గౌరవ వేతనం రూ.6000 నుంచి రూ.10,000కు పెంచుతూ ప్రభుత్వం జియోను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సెయం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి పాలనలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్రమే వచ్చేది. ఈ వేతనంతో అర్చకులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ వారి వేతనాన్ని రూ.6వేలకు పెంచారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అర్చకుల వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. గతంలో 1805 దేవాలయాలకు మాత్రమే ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తే దశలవారీగా మరిన్ని ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 6,541 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. ధూప దీప నైవేద్య పథకానికి సంవత్సరానికి 78.49 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.
సెప్టెంబర్ 2న డబుల్ ఇండ్ల పంపిణీ.. గృహ ప్రవేశానికి మూడు రోజులే..!
మహానగరంలో సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు మరో మూడు రోజుల్లో గృహ ప్రవేశం లభిస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు ర్యాండమైజేషన్ పద్ధతిలో అర్హులను ఎంపిక చేశారు. నియోజకవర్గానికి 500 మందికి చొప్పున గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో 12 వేల మంది లబ్ధిదారులకు ఒకేరోజు డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానున్నాయన్న సమాచారంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపికైన 12 వేల మంది లబ్ధిదారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని లబ్ధిదారులను అభినందించారు.
పెళ్లి భోజనాలు చేసి ఆసుపత్రి పాలైన 150 మంది
పెళ్లి అనగానే చాలా మంది వధూవరుల గురించి కాకుండా అక్కడ వండే వంటకాల గురించి ఆలోచిస్తారు. రకరకాల పుడ్ ఐటమ్స్ ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకంగా తినడం కోసం వెళ్లే వారు కొందరు ఉంటారు. కుటుంబ సమేతంగా కూడా పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి అనంతరం భోజనాల దగ్గరకు వెళతారు. అయితే శుభకార్యం జరిగిన పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి భోజనాలు తిని 150 మంది ఆసుపత్రి పాలయ్యారు. కర్ణాటకలోని బెలగావిలో ఈ ఘటన జరిగింది. హిరేకోడిలోని చెకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. బంధు, మిత్రులతో పాటు గ్రామంలోని చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకకు హాజరైన చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. భోజనం చేసిన రెండు గంటల తర్వాత వీరందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో వీరందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేపించారు. భోజనాల్లో కల్తీ జరగడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వంట పదార్థాలను, అలాగే వాటర్ ని కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స అందించడం కోసం గ్రామంలోని ఎమర్జెన్సీ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. భోజనాలు తినడం వల్ల అస్వస్థతకు గురైన వారందరూ మొదట బెలగావిలో ఉన్న హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు.
