Site icon NTV Telugu

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తెలంగాణలో పెరిగిన చలి

ఉత్తర భారత దేశాన్ని గత వారంపాటు గజగజ వణికించిన చలి ఇప్పుడు దక్షిణ భారత దేశం వైపు వణికించేందుకు వచ్చేస్తోంది. దీని వల్ల తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అలాగే మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత ఎక్కువ కానుంది. జనవరి 12 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువకానుంది. ఇక సాయంకాలం 4 గంటల నుంచి చలి ప్రారంభించి తెల్లవారుజాము వరకు కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

 

చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు.. నగరంలో పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్‌ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. చైన్‌ స్నాచింగ్‌ ఘటనలతో అప్రమత్తమయ్యారు రాష్ట్ర పోలీసులు. తెల్లవారు జామునుంచే స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. నిందితులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్‌, యూసఫ్‌ గూడ, అమీర్‌ పేట్ కెఎల్ఎమ్‌ షాపింగ్‌ మాల్‌, పంజాగుట్ట పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తు్న్నారు. మొత్తం 13 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తున్న పోలీసులు. ఫోటోలోని చైన్స్ స్నాచింగ్ చోరీలకు పాల్పడే ముఠాగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోటోలోని వ్యక్తులు ఎక్కడైనా తారసపడ్డ గుర్తించిన తక్షణమే డయల్ 100 కానీ.. స్థానిక పోలీసులకు గాని సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు గాను మిగతా గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.

 

నాగబాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్ 

మెగాబ్రదర్ నాగబాబుకి ఏపీ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విషయం ఉంటేనే విమర్శ చేయాలి గానీ, నోటికి ఎంతొస్తే అంత బాగడం సబబు కాదన్నారు. ఏమీ తెలియకుండా తన శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం, ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రీసెంట్‌గా నాగబాబు ఓ వీడియోలో మాట్లాడుతూ.. తన సోదరులైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని.. పర్యటనలు మానేసి, పర్యాటక శాఖ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని, రోజా పదవి నుంచి దిగిపోయేలాగా 20వ స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకు కౌంటర్‌గానే రోజా ఫేస్‌బుక్ మాధ్యమంగా స్పందించారు.

 

నేడు హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ

హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఉదయం జరగనుంది. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. 10 మంది వ్యక్తుల జాబితాను పార్టీ హైకమాండ్‌కు సమర్పించామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే రాష్ట్రంలో పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు.

 

హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి. అతను వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని చంపినట్లు ఆరోపణలు ఉన్నాయని బారాబంకి పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ కిల్లర్ కొద్ది రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళలను హత్య చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న హంతకుల కోసం ఆరు బృందాలు బారాబంకి పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు అనుమానితుడి ఫోటోను కూడా విడుదల చేశారు. అతని గురించి ఏదైనా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

వారసుడు ట్విస్టు.. సినిమాలో మహేశ్ బాబు కీ రోల్

తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు మహేష్ బాబు. తమిళ చిత్రసీమలోనూ ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కారణం మహేష్ బాబు చెన్నైలో పెరిగాడు. మహేష్‌ కాలేజీ చదువులు పూర్తి చేసిన తర్వాత తన సినిమా కెరీర్‌ని ప్రారంభించేందుకు ఇక్కడకు చేరుకున్నారు. మహేష్ బాబు, విజయ్ ఇద్దరూ సన్నిహిత మిత్రులన్న సంగతి తెలిసిందే. తెలుగులో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో తమిళంలో విజయ్ గిల్లి అనే చిత్రంలో నటించాడు. అలాగే పోకిరి కూడా మహేష్ బాబుకు తెలుగులో భారీ హిట్ అందించింది. అదే విధంగా విజయ్ నటించిన పోకిరి చిత్రం తమిళంలో కూడా రూపొందింది. గిల్లి, పోకిరి రెండూ విజయ్ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. మహేష్ బాబు 1999 వరకు చెన్నైలో ఉన్నారు. అందుకే మహేష్ బాబు తమిళంలో అనర్గళంగా మాట్లాడతాడు. అలాగే మహేష్ బాబు, విజయ్, సూర్య మరియు యువన్ శంకర్ రాజా చెన్నైలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చెన్నైలోని లయోలా కాలేజీలో చదువుకున్నారు. విజయ్ కంటే సూర్య ఒక సంవత్సరం సీనియర్.

 

భారత్‌దే టీ20 సిరీస్

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ కుదిర్చిన భారీ లక్ష్యంతో (229) బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 91 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం, బౌలింగ్‌లో బౌలర్లందరూ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడం వల్లే.. భారత్ ఈ ఘనవిజయాన్ని సాధించగలిగింది. ఫలితంగా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది.

Exit mobile version