కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడు వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ జరగలేదని మండిపడ్డారు. ఈ సమావేశాలు కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లెందుకు, అసత్య ఆరోపణలు చేసేందుకు ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగంలో కాంగ్రెస్ ను పొగడటం, బీజేపీని విమర్శించటం తప్పా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ మద్దతు కోసం అర్రులు చాస్తున్నట్లు కనిపించిందని ఆరోపించారు. కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులను తిట్టి మళ్ళీ వాళ్ళతో జత కడుతున్నాడని మండిపడ్డారు. మజ్లిస్ ను పొగడని రోజు ఉండదని, కల్వకుంట్ల ఫ్యామిలీ, మజ్లిస్ బ్రదర్స్ ఒకరినొకరు పొగుడు కుంటారని ఆరోపించారు.
హైకోర్టు కీలక నిర్ణయం
ఇవాళ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసం విచారణ చేపట్టింది. కాగా.. విచారణ సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నగరప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని నిలిపివేశామని చెప్పింది. ఈనేపథ్యంలోనే స్పందించిన సీజే ధర్మాసనం ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. అయితే హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనేపథ్యంలో.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి సంబంధించి సింగిల్ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌లో ఇంప్లీడ్ చేసింది..తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.
కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ
మార్చి 10 వ తేదీన రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. విజయవాడలో రైల్వేకు సంబంధించి ఆక్రమిత భూ బదలాయింపుకు సంబంధించి వైఎస్ జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాసారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో 800 కుటుంబాలు రైల్వే స్థలాన్ని ఆక్రమించి 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాయి. పేదలు ఆక్రమించిన భూమి క్రమబద్దీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైల్వే శాఖకు ఉపయోగంలో లేని ఈ భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. దానికి బదులుగా అజీజ్ పేటలోని 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు బదిలీ చేస్తామని లేఖలో జగన్ పేర్కొన్నారు. మరి ఈ లేఖపై కేంద్ర రైల్వేశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.
సుప్రీం జడ్జీలుగా ఇద్దరు ప్రమాణం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో న్యాయమూర్తులు జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందకముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా, జస్టిస్ అరవింద్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జనవరి 31న సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో ఫిబ్రవరి 6న సీజేఐ ప్రమాణం చేయించారు.
ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శనను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023 ప్రదర్శనను బెంగళూరు శివారులోని యలహంకలో ప్రారంభమైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఏరో ఇండియా-2023లో ఎయిర్ షోలు, ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకోనుంది. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహించనున్న ప్రదర్శనను ప్రధాని మోదీ ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రధాని ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ ఈవెంట్ 14వ ఎడిషన్ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి స్వదేశీ పరికరాలను, సాంకేతికతలను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తున్నారు. ‘భారత్‌లో తయారీ- ప్రపంచ కోసం తయారీ’ అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా షహబుద్దీన్ చుప్పు ఎన్నిక
అవామీ లీగ్ నాయకుడు మహ్మద్ షహబుద్దీన్ చుప్పు బంగ్లాదేశ్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెజారిటీ ఉన్న ఆయనను అధికార పార్టీ నామినేట్ చేయడంతో.. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వారు ఎవరూ లేకపోవడంతో, చుప్పు అప్రమేయంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అవామీ లీగ్ పార్లమెంటరీ పార్టీ అవినీతి నిరోధక కమిషన్ మాజీ కమిషనర్, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, స్వాతంత్య్ర సమరయోధుడు షహబుద్దీన్ చుప్పును అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నామినేట్ చేసినట్లు జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాదర్ ఆదివారం మీడియాకు తెలిపారు.
నయనతారని లేడీ సూపర్ స్టార్ అనకండి
లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హాత్ట్ టాపిక్ అయ్యారు. గతంలో ‘మాస్టర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో మాళవిక మోహనన్ “నేను ఒక సీన్ చూసాను, అందులో హీరోయిన్ హాస్పిటల్ బెడ్ పైన ఉంది. పేషంట్ లా ఉండాల్సిన హీరోయిన్, మేకప్ వేసుకోని ఉండడం ఏంటో అర్ధం కాలేదు. అది కమర్షియల్ సినిమా అని తెలుసు కానీ కొంచెం అయినా రియలిస్టిక్ గా ఉండాలి కదా” అంటూ ఇండైరెక్ట్ గా నయనతార గురించి కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ నయనతార వరకూ వెళ్లడంతో “నేనొక ఇంటర్వ్యూ చూసాను, అందులో ఒక హీరోయిన్ నా పేరు చెప్పలేదు కానీ తను చెప్పింది నా గురించే. అందులో హాస్పటల్ సీన్ లో నటించింది నేను, అయితే ఇప్పుడు హాస్పిటల్ సీన్ అనగానే జుట్టు అంతా చెరిపేసుకోని బెడ్ పైన పడుకోవాలనేమి లేదు. హాస్పటల్ స్టాఫ్ మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పైగా అది ఆర్ట్ సినిమా కాదు కమర్షియల్ సినిమా. నా డైరెక్టర్ ఎలా చెయ్యమంటే అలానే చేశాను, కమర్షియల్ సినిమాలో మరీ అంత మెలోడ్రామా ఉండాల్సిన అవసరం లేదు” అంటూ నయన్ కూడా మాళవిక మోహనన్ పేరు చెప్పకుండానే కౌంటర్ వేసేసింది. ఈ విషయంలో కొంతమంది మాళవిక మోహనన్ కి సపోర్ట్ చేశారు, మరికొంతమందేమో నయనతారకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఇష్యూని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ నయన్ ఫాన్స్ vs మాళవిక మోహనన్ గొడవ మొదలయ్యింది.
