NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

తాత జయంతి..ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి గురించి తెలియని వారు వుండరు.నటుడుగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.తెలుగు భాష ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకోని వెళ్లిన ఘనుడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ నటుడుగా ,నాయకుడుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ “యుగపురుషుడుగా” నిలిచారు.సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అద్భుతముగా రాణించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు.నేడు మే 28 స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 101 వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ఆయనను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల..

జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో ఉన్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్, వరంగల్ కాకతీయ తోరణం తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా సర్కార్ చిహ్నం తయారు చేస్తున్నట్లు తెలిపింది. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు విశ్వనీయం సమాచారం. జూన్ 2 నాటికి పూర్తిస్థాయిగా పలుమార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు.

గత 24 ఏళ్లుగా ప్రతిపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయి..

ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 1న జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఏడో దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ.. గత 24 ఏళ్లుగా విపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా.. ఈ వ్యక్తులు (ప్రతిపక్షాలు) దుర్వినియోగం చేసేందుకే ఇష్టపడుతారని విమర్శించారు. అలాగే, భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి.. ప్రజాస్వామ్యంలో మాకు శత్రుత్వం లేదన్నారు. దేశ భవిష్యత్తు కోసం నన్ను నేను త్యాగం చేయడానికి మార్గాన్ని ఎంచుకున్నాను అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్న

ఎన్టీఆర్‌ 101వ జయంతిని పురస్కరించుకొని.. ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 4 తర్వాత ఏపీలో మళ్లీ జగన్ పరిపాలన రాబోతుందన్నారు.. అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్‌ జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయి. జూన్‌ 4 తర్వాత జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.

అయోధ్య శ్రీ రామయ్యకు దుబ్బాక చేనేత వస్త్రం..

సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశ వ్యాప్తంగా మార్మోగింది. దుబ్బాక చేనేత కార్మికులు కొత్త వస్త్ర డిజైన్లను తయారు చేయడంలో ప్రశంసలు లభిస్తున్నాయి. దుబ్బాక చేనేత వస్త్రాన్ని ధరించి కీర్తిని మరింతగా వ్యాపింపజేసిన అయోధ్య శ్రీరామచంద్రుడు. వారం రోజుల పాటు ప్రతిరోజు రాముడికి రంగుల వస్త్రంతో అలంకరించాలని ఆర్డర్ వచ్చింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాకలో స్థాపించిన దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీ తయారు చేసిన లినెన్ ఇక్కత్ చేనేత వస్త్రాన్ని (పింక్ కలర్) ఆదివారం అయోధ్య రాముడికి అలంకరించారు.

నీతి వంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్..

నీతి వంతమైన రాజకీయలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాగమయి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. యే నాయకులకు దక్కని ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. నీతి వంతమైన రాజకీయలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఓట్ల కోసం ఆయన పధకాలను చూపిస్తూ ఇతర పార్టీ లు వారు అధికారం కోసం అవసరల కోసం ఎన్టీఆర్ భజన చేస్తున్నారని అన్నారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్ ని అవే ఇప్పటికి కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.

అంత్యక్రియలకు డబ్బులు లేవని భార్య మృతదేహాన్ని…!

ఇండోర్‌లో 53 ఏళ్ల వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డు పక్కన పడేశాడు. మే 26వ తేదీ రాత్రి కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించగా, ఆ మహిళ భర్త వద్ద డబ్బులు లేవని ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసినట్లు విచారణలో వెలుగు చూసింది . అంత్యక్రియలు. అయితే మహిళ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని ఉంచాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు ఆరా తీయడంతో భయపడిపోయి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇంటికి కొంత దూరంలోని నిర్జన రహదారిపై వదిలేశాడు. ఆదివారం రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు గోనె సంచిని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు.. ఆమె మలవిసర్జనపై ఎలాంటి గాయాలు లేవని, కాలేయ వ్యాధితో ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఇలా చేశానని ఆ వ్యక్తి చెప్పాడు. అతని మానసిక పరిస్థితి కూడా బాగా లేదని ఏసీపీ నందినీ శర్మ పీటీఐకి తెలిపారు. మరోవైపు పోలీసులు మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు.

ట్రాఫిక్‌లో ఇలా కూడా చేస్తారా..?

తమిళనాడులోని తిరుచ్చిలో ఇరుకైన రోడ్డు డివైడర్‌పై ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా, ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. రోడ్డు భద్రత, స్టంట్ డ్రైవింగ్ పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వైరల్‌గా మారిన వీడియోలో , తిరుచ్చిలోని కొల్లిడం నది వంతెనపై రహదారికి ఇరువైపులా భారీ ట్రాఫిక్ మధ్య ఇరుకైన రోడ్డు డివైడర్‌పై ఒక యువకుడు తన బైక్‌ను నడుపుతున్నట్లు చూడవచ్చు. ఆ యువకుడు హెల్మెట్ కూడా ధరించకుండా ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. మే 23న పెరుంబిడుగు ముత్తురాయర్‌ జన్మదినమైన ‘ముత్తరాయర్‌ సత్యవిజయ’ సందర్భంగా కొంత మంది యువకులు బైక్‌ ఊరేగింపు చేపట్టగా, డివైడర్‌పై ఓ యువకుడు బైక్‌ను నడిపిన ఘటన చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాఖలైన మూడు అదనపు కేసుల్లో రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం ఈవీఎం పగులగొట్టిన కేసులో కోర్టు నుంచి ఉపశమనం పొందిన కొద్దిసేపటికే పోలీసులు తనపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేయడంతో పిన్నెల్లి సోమవారం హైకోర్టులో తాజా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్టీఆర్‌ అంటే ఓ శక్తి.. తెలుగువారికి ఆరాధ్య దైవం!

నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ తదితరులు అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు.