NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఒక జర్నలిస్టు నాకు ఫోటో పంపాడు.. అది చూస్తుంటే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ జర్నలిస్ట్ పంపిన ఫోటో సంచలనంగా మారింది. ఆ ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారంటూ చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే.. చాలా ఆనందం వేసిందని తెలిపారు. ఒక జర్నలిస్టు మిత్రుడు ఈ ఫోటో తీసి నాకు పంపాడు. అది చూసిన నాకు చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ వేదిగా పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్సు జర్నీ మహిళల కోసమే కాకుండా సూళ్లకు వెళ్లే అమ్మాయిలకు కూడా ఎంత ఉపయోగ పడుతుందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇది మా కాంగ్రేస్ సర్కారు పాలన అంటూ రేవంత్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

మాజీ మంత్రి మల్లారెడ్డి కి మరో షాక్‌.. భూకబ్జా కేసు నమోదు..
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మల్లారెడ్డిపై పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లార్ రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై మొత్తం ఏడు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. పేట్ బషీర్ బాద్ లో 32 గుంటల భూమి ఆక్రమణకు గురై నిర్మాణాలు కూల్చివేసినట్లు శేరి శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి పేట్ బషీర్ బాద్ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. తాజాగా మల్లార్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి జోక్యంతో సుచిత్రలో పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఈ కేసులో పేట్ బషీర్ బాద్ మల్లారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వేనెంబర్ 82, 83లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండున్నర ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు. 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని 15 మంది పేర్కొనగా, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఆ స్థలంలో ఎలాంటి గొడవలు జరగవద్దని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇప్పడు మరో భూవివాదంలో మల్లారెడ్డిపై కేసు నమోదు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.

రైతుపై బ్యాంకు అధికారుల కఠినత్వం.. రుణం చెల్లించలేదని భూముల వేలం
బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్‌‌కు అంటిస్తారు. అది కూడా లేదంటే నేరుగా లోన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వాకబు చేస్తారు. కానీ, కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుల పట్ల బ్యాంకు అధికారుల తీరు సర్వత్రా వివాదాస్పదం అవుతోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంట సాగుకు కోసం డిస్ట్రిక్ కొ-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సహకార బ్యాంకు నుంచి పలువురు రైతులు గతేడాది రుణాలు తీసుకున్నారు. లోన్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు గడువు ముగిసింది. దీంతో రైతులు రుణాలు ఎవరూ డబ్బు కట్టపోవడంతో బ్యాంక్ అధికారులు వినూత్న రీతిలో రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. లింగంపల్లి మండలం, పొల్కంపేట్ గ్రామంలో ఉన్న రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు, ఎరుపు రంగు జెండాలను నాటారు. తీసుకున్న లోన్ అమౌంట్ వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో భూములను వేళం వేస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలోని రైతులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. పొట్ట నింపే రైతుల భూమిని లాక్కుంటే కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా పంటలు నేల పాలైందని కన్నీరుమున్నీరుగా విలపించాలరు. ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలని వాపోతున్నారు. అన్నం పెట్టే రైతన్ననే ఇలా రోడ్డుకు లాగితే.. ఆకలికే అంతులేకుండా పోతుందని అంటున్నారు. భూమినే నమ్మకుని బతుకుతున్నామని ఇప్పుడు ఆ భూమికూడా బ్యాంక్ అధికారులు లాక్కుంటే చిన్నపిల్లలు కుటుంబంతో సహా రోడ్డున పడాలి అంటున్నారు. రుణాలు చెల్లించకపోతే పొలాల్లోకి వచ్చి జెండాలు పెట్టడం ఏంటని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి పోలాలను వేళం వేయకుండా ఆపాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది అనేది వేచి చూడాలి.

ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది అని ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని పేర్కొన్నారు. అలాగే, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తున్నట్లు రెండో సంతకం పెట్టారని చెప్పుకొచ్చారు. ఇక, సామాజిక పింఛన్లు 3 వేల రూపాయల నుంచి 4 వేలకు పెంచుతూ ఏపీ సీఎం మూడో సంతకం పెట్టారని జనసేన అధినేత, మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ సీఎం చంద్రబాబు నాలుగో సంతకం చేశారని మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే, యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ పై అయిదో సంతకం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని ఎక్స్ వేదికగా ఏపీ రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్దరణ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పెన్షన్ల పెంపుపై జీవో జారీ చేశారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీం చంద్రబాబు సర్కార్ అమలు చేయనుంది. 3 వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ను రూ. 4 వేలకు పెంచేశారు. అలాగే, వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్సకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్ వంటి వారికి పెంచిన 4 వేల రూపాయల పెన్షన్ అందించనున్నారు. అలాగే, దివ్యాంగులకు 3 వేల నుంచి 6 వేల రూపాయలకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొనింది. పూర్తి స్థాయి దివ్యాంగులకు ఇచ్చే 5 వేల నుంచి 15 వేల రూపాయలకు పెంచినట్లు ఏపీ సర్కార్ తెలిపింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెన్షన్ పెంపు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. పెంచిన పెన్షన్ తొందరలోనే అందిస్తామని వెల్లడించారు.

ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేకపోవును.. కూటమి పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టం జరిగేది అని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని కోరారు. ప్రస్తుతం టీడీపీ ఏం చెబితే అదే జరుగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. అలాగే, 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలి.. ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయి.. కరుణానిధికి ఏడు స్థానాలు వచ్చిన, జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన.. సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి మళ్లీ అధికారంలోకి వచ్చారు అని గుర్తు చేశారు. ఇక, ఉల్లిపాయదారి పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయింది.. ఆంధ్ర రాష్ట్రంలో మధ్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణమయ్యాయి.. ఈవీఎంలపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని ఉండవల్లి అన్నారు.

మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ పొత్తుకు బీటలు.. మంట పెట్టిన ఆర్ఎస్ఎస్ కథనం..
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేలో భాగంగా ఉన్న బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తుకు బీటలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమి కన్నా ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా బీజేపీ, ఎన్సీపీ మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 సీట్లు(బీజేపీ 09, శివసేన షిండే 07, ఎన్సీపీ అజిత్ పవార్ 01) గెలుచుకుంటే, ఇండియా కూటమి 30( కాంగ్రెస్ 13, శివసేన ఉద్ధవ్ 09, ఎన్సీపీ శరద్ పవార్ 08) స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సమయంలో రాజకీయాలు వేగంగా మారతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలా వద్దా అనేదాన్ని అంచనా వేయడానికి బీజేపీ అంతర్గత సర్వే ప్రారంభించింది. ఇదిలా ఉంటే బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ ఈ పొత్తును అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’లో వచ్చిన కథనం ఇరు పార్టీల మధ్య దూరాన్ని మరింతగా పెంచుతోంది. ‘‘ఈ అనాలోచిత చర్య ఎందుకు తీసుకున్నారు? ఈ కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడినందుకు బిజెపి మద్దతుదారులు గాయపడ్డారు మరియు హింసించబడ్డారు. ఒక్క దెబ్బతో బిజెపి తన బ్రాండ్ విలువను తగ్గించుకుంది’’ అని ఆర్ఎస్ఎస్ రతన్ శారదా కథనంలో రాశారు. అనమసరమైన రాజకీయాలకు, అవకతవకలకు మహారాష్ట్ర మంచి ఉదాహారణ అని, బాగా పనిచేసిన పార్లమెంటీరియన్ల కన్నా ఆలస్యంగా వచ్చిన వారిని ఆదరించారని ఆర్టికల్ పేర్కొంది.

జో బైడెన్‌కి ఏమైంది, జీ-7 కోసం వెళ్లి వింత ప్రవర్తన.. వీడియో వైరల్..
ఇటలీ వేదిక జీ-7 సమ్మిట్ జరుగుతోంది. ఆ దేశంలోని అపులియా ఇందుకు వేదిక కాబోతోంది. ఇప్పటికే సభ్యదేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడాల దేశాధినేతలు ఇటలీ చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వీరిందరిని సాధారంగా ఆహ్వానించారు. మరోవైపు మెలోనీ ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం పంపారు. నిన్న మోడీ ఇటలీ బయలుదేరారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఫోటోగ్రాఫ్ కోసం సభ్యదేశాల దేశాధినేతలు ఫోజ్ ఇచ్చే సమయంలో వారి నుంచి దూరంగా వెళ్లిన బైడెన్ అభివాదం చేయడం వీడియోలో కనిపించింది. బైడెన్ వేరే వైపు వెళ్లి థంప్సప్ చూపించడం కనిపిస్తోంది. అయితే, అటువైపు ఎవరూ ఉండటం కనిపించలేదు. ఆ తర్వాత ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బైడెన్ వద్దకు వచ్చి చెప్పడంతో ఇతర దేశాధినేతలతో కలిసి ఫోటోకు ఫోజ్ ఇవ్వడం చూడొచ్చు. ఇటీవల బైడెన్‌ని ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ తీవ్రంగా ట్రోల్ చేసింది. వైట్‌హౌజ్‌లో సంగీత ప్రదర్శన అయినపోన తర్వాత దాదాపు ఒక నిమిషం పాటు కదలకుండా ఉండిపోవడంపై ఎగతాళి చేసింది. ఇది జరిగిన తర్వాత ప్రస్తుతం ఇటలీలో మరో ఘటన చోటు చేసుకుంది. జోబైడెన్ ఇలా తడబడటం ఇదే తొలిసారి కాదు. ఫిబ్రవరిలో, అధ్యక్షుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేరును మాజీ నాయకుడు ఫ్రాంకోయిస్ మిత్రాండ్‌‌గా పిలికారు. అతను మరణించి దాదాపుగా 30 ఏళ్లు అయింది. మరో సందర్భంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ని ప్రెసిడెంట్‌గా సంబోధించాడు.

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!
టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లండ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఒమన్‌ నిర్ధేశించిన 48 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్స్ కోల్పోయి 3.1 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో 101 బంతులు మిగిలుండగానే ఇంగ్లీష్ జట్టు లక్ష్యాన్ని సాధించింది. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 2014 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై లంక 90 బంతులు మిగిలుండగానే.. లక్ష్యాన్ని సాధించింది. పదేళ్ల తర్వాత లంక రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మూడు, నాలుగు స్థానాల్లో ఆస్ట్రేలియా (86 బంతులు, నమీబియాపై 2024), ఆస్ట్రేలియా (82 బంతులు, బంగ్లాదేశ్‌పై 2021) ఉంది. భారత్ (81 బంతులు, స్కాట్లాండ్‌పై-2021), శ్రీలంక (77 బంతులు, నెదర్లాండ్స్‌‌పై 2021) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వారసుడు రెడీ అవుతున్నాడు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీకి సిద్ధమాయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. తాజాగా గౌతమ్ జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. గౌతమ్ వర్కౌట్లు మొదలు పెట్టేశాడు. గౌతమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. గౌతమ్ తన బాడీని బిల్డ్ చేసుకుంటున్న విధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఇప్పటికే తండ్రీ కొడుకులను చూసి ఎవరు ప్రిన్స్ అని కన్యుఫ్యూజన్ అవుతున్నారు.. ఇప్పుడు గౌతమ్ బాడిని చూసి ఇద్దరు సేమ్ అని భావిస్తున్నారు.. ప్రస్తుతం గౌతమ్ జిమ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో గౌతమ్ స్విమ్మింగ్ చేస్తున్నాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడు. చూస్తుంటే గౌతమ్ త్వరలోనే సిక్స్ ప్యాక్‌లో కూడా కనిపించేలానే ఉన్నాడే? అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఈ విధంగా వర్కౌట్స్ చెయ్యడం చూస్తే త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. ఓ సారి ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి..