NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు రిలీఫ్.. రెండు పరీక్షలను ఒకేచోట రాసేందుకు ఛాన్స్..స

తెలంగాణ డీఎస్సీలో ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రెండు పరీక్షలు ఒకే చోట రాసే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు ఉదయం మొదటి పరీక్ష రాసిన కేంద్రంలోనే మధ్యాహ్నం రెండో పరీక్షకు హాజరయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించారు. అలాంటి వారి కోసం హాల్ టిక్కెట్లు మారుస్తామని అధికారులు స్పష్టం చేశారు. చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో మొదటి పరీక్ష ఉదయం ఒక జిల్లాలో, రెండో పరీక్ష మధ్యాహ్నం మరో జిల్లాలో జరిగింది. కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా వారు స్పందించి ఉపశమనం కల్పించారు. డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి.

జాతీయ రహదారి విస్తరణకు త్వరలో టెండర్లు

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఏపీ-తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది. పండగల సమయంలోనేతై ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. కి.మీ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండగా.. విస్తరణ చేపట్టాలనే ఎప్పట్నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇటీవల భేటీ అయ్యారు. రోడ్డు విస్తరణపై కేంద్రమంత్రితో కోమటిరెడ్డి చర్చించగా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఈ రహదారిని ఆరు వరుసలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణకు కసరత్తు మెుదలైంది. ఈ రహదారి విస్తరణ డీపీఆర్‌ రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది.

డొనాల్డ్ ట్రంప్ పార్టీకి ఎలాన్ మస్క్ మద్దతు.. భారీ విరాళం..!

యూఎస్ బిలినీయర్ ఎలన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుగా నిలిచాడు.. ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీ విరాళం అందించాడు. రాబోయే అధ్యక్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున మ‌రోసారి ట్రంప్ పోటీలో ఉండబోతున్నారు. అయితే, ట్రంప్ త‌ర‌పున ఎన్నిక‌ల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా ప్కాయ్ అనే కంపెనీకి మస్క్ భారీ ఎత్తున విరాళాలు ఇచ్చినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న జో బైడెన్ పై మస్క్ ఇటీవల విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ కోసం ప‌ని చేసే అమెరికా ప్యాక్ సంస్థకు ఎలాస్ మస్క్ ఎంత మొత్తంలో విరాళం ఇచ్చారనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. కానీ ఆ సంస్థ మాత్రం ఈనెలలోనే డోనార్ల జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుంది.

గుంటూరు జిల్లా కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదని, మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందన్నారు. మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందుకు రావాలన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభించిన స్ఫూర్తితోనే నాడు 203 అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామని, ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు లేకపోతే ఇప్పుడుండే జైళ్లు, ఆసుపత్రులు కూడా చాలనంతగా నేరాలు పెరిగిపోతాయన్నారు సీఎం చంద్రబాబు. దైవసేవతో పాటు మానవ సేవనూ హరేకృష్ణ సంస్థ సమానంగా చేస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికత పెంపొందించేందుకు ఇస్కాన్, హరేకృష్ణ సంస్థలు పోటీ పడుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమన్నారు.

నేడు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యంతో సీఎం రేవంత్ భేటీ..

ఇవాళ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సీఎం భేటీ కానున్నారు. కాలేజీల యాజమాన్యాలతో జరిగే సమావేశంలో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపుపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ విద్య స్థితిగతులను బుర్రా వెంకటేశం సీఎంకు వివరించనున్నారు. ఒక మరోవైపు జూలై 16న కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వనమహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై చర్చ నిర్వహించనున్నారు.

మరోసారి పల్నాడు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటన

పల్నాడు జిల్లాలో మరొకసారి మంత్రి నారాయణ పర్యటించుకున్నారు ….పిడుగురాళ్ల ప్రాంతంలో డయేరియా ప్రభలి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రెండు రోజుల క్రితం పలనాడు ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు ….అక్కడ తీసుకుంటున్న చర్యలతో పాటు, తీసుకోవలసిన చర్యలపై కూడా అధికారులకు నిజానిర్దేశం చేశారు… అయినప్పటికీ డయేరియా అదుపులోకి రాకపోవడంతో, నేడు మరొకసారి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించనున్నారు మంత్రి… నిన్న ఒక్కరోజే 21 కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది…. గడిచిన 15 రోజులుగా 200 పైగా డయేరియా కేసులు నమోదవడం, కొంతమంది మృత్యువాత పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోంది…. స్పెషలిస్ట్ సీనియర్ డాక్టర్లను పిడుగురాళ్ల పంపించే యోచన లో ఉంది ప్రభుత్వం.. అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్..

ఇవాళ కాంగ్రెస్ లో శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, తదితరులు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్చ ఎనిమిది నుంచి తొమ్మిదికి చేరింది. ఇవాళ ఉదయం జూబ్లిహిల్స్ లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ లో చేరుకోవడంతో సీఎం ఘనంగా పార్టీ కండువాకప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

లక్నో-ఢిల్లీ హైవే మూత.. 11 మంది మృతి.. యూపీలోని 16 జిల్లాల్లో వరద బీభత్సం

ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. నేపాల్ నుంచి నీటిని విడుదల చేయడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు నీటితో నిండిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వరదల కారణంగా లక్నో-ఢిల్లీ రహదారిని మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో 11 మంది నీటమునిగి, పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నీటితో నిండిపోయాయి, రోడ్లు జామ్‌ అయ్యాయి. వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. వరద నీరు చేరడంతో పాముల నీడ కూడా ప్రజలపై కమ్ముకుంది.

ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు

వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఒకరు కోడి గుడ్ల మీద ఈకలు పీకుతాడన్నారు. మచిలీపట్నం లో అత్యధిక మెజారిటీ తో నిన్ను, నీ కుమారుడిని ఓడించారని, ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారన్నారు బుద్దా వెంకన్న. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆయన మండిపడ్డారు. ఆరు అడుగుల నిజాయితీ కి నిదర్శనం చంద్రబాబు అని ఆయన కొనియాడారు. ఐదు అడుగుల తాచుపాము జగన్ అని, ఈ తాచుపాముకు తన మన బేధం‌లేదు.. ఎవరినైనా కాటేస్తాడన్నారు. వైఎస్, జగన్ లు ఎన్ని విచారణ లు చేసినా చంద్రబాబు తప్పు చూపలేకపోయారన్నారు బుద్దా వెంకన్న.

అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం ప్రయత్నాలు..

అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కొత్తగా ఏర్పాటు చేసిన బస్సులను మంత్రులు ప్రారంభించారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ నుంచి హైదరాబాద్ కు ఇక ఏసీ, మూడు డీలక్స్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాన్నారు. నల్గొండ నుంచి హైదరాబాద్ కు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడన్నారు. రాష్ట్ర సాధన కోసం స్వపక్షంలో విపక్ష నేతగా ఉన్నారు పొన్నం అని తెలిపారు.