Site icon NTV Telugu

Top Luxury Trains India: నిజంగా ఇవి రైళ్లు కాదు భయ్యా.. ఇండియాలో టాప్ 5 ట్రైన్స్ ఇవే..

Top Luxury Trains India

Top Luxury Trains India

Top Luxury Trains India: ఇండయాలో టాప్ 5 ట్రైన్స్ ఏంటో మీకు తెలుసా.. నిజంగా ఇవి మాత్రం రైళ్లు కాదు భయ్యా.. విమానం ధరలతో కదిలే రైళ్లు ఇవి. నిజం చెప్పాలంటే ఓ సామాన్యుడు తన పని నిమిత్తం ఒక చోటు నుంచి మరొక చోటుకు రైలులో ప్రయాణించడానికి అనేక అవస్థలు పడుతున్నాడు. అలాంటి సామాన్యుల నెల రోజుల జీతం.. అంతకంటే ఎక్కువ డబ్బులే ఇలాంటి రైళ్లలో ఒక ప్రయాణానికి హం ఫట్ అవుతాయి. సమయం కలిసి వచ్చి ఏదో రోజు ప్రతి సామాన్యుడు ఇలాంటి రైళ్లలో ప్రయాణించాలని ఆశిద్దాం.. ఇంతకీ ఈ రైలు ప్రత్యేకలు ఏంటి, ఎందుకని ఇవి ఇంత స్పెషల్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Ganesh Visarjan 2025 : డీజే బాణీలకు పోలీస్ అధికారులు స్టెప్పులు

ప్రపంచంలోనే బెస్ట్ లగ్జరీ ట్రైన్‌..
వరుసగా 6 ఏళ్లుగా ప్రపంచంలోనే బెస్ట్ లగ్జరీ ట్రైన్‌గా మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ గుర్తింపు తెచ్చుకుంది. నిజంగా భయ్యా ఈ రైలులో ఎక్కితే రాయల్ ఫీలింగ్ కలుగుతుందంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ రైలులో ఎక్కితే ఇండియాలోని అనేక రాచరిక ప్రాంతాలు, చారిత్రక కోటలు, చారిత్రక వారసత్వ ప్రదేశాలను చుట్టిరావచ్చు. ఇది ఢిల్లీ, త్రివేండ్రం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ జర్నీలో ది ఇండియన్ స్ప్లెండర్, ది హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పనోరమ, ట్రెజర్స్ ఆఫ్ ఇండియా వంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. రూమింగ్, డీలక్స్ క్యాబిన్, జూనియర్ సూట్, సూట్, ప్రెసిడెన్షియల్ సూట్ కోచ్‌ ఆప్షన్లను సెలక్ట్ చేసుకోవచ్చు. ఏ ప్యాకేజీలోనైనా 7 పగళ్లు/ 6 రాత్రుల పాటు ట్రావెల్ చేయవచ్చు. ప్రెసిడెన్షియల్ సూట్‌లో ట్రావెల్ చేయాలంటే 25 వేల డాలర్లు కట్టాలి.

రాజస్థాన్ వారసత్వాన్ని చూపిస్తుంది..
రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ పేరుకు తగ్గట్టుగానే ప్రతి స్టాప్‌లో రాజస్థాన్ వారసత్వాన్ని చూపిస్తుంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే.. రాచరిక నివాసాలను పోలి ఉండే క్యాబిన్లు సొంతం చేసుకోవడం. గంభీరమైన రాజభవనాలు, భారీ కోటలు, రాజస్థాన్ ఆతిథ్యాన్ని ప్రదర్శించే సాంస్కృతిక ప్రదేశాలను ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. ఢిల్లీలో ట్రైన్ ఎక్కొచ్చు. సీజన్‌ని బట్టి ఈ ట్రైన్ ప్యాకేజీ ధరలు మారుతుంటాయి. పీక్ సీజన్‌లో డీలక్స్ క్యాబిన్ ఒక్కరికి రూ.9,85,376గా ఉంది.

ఏదో రాజుల రథంలో వెళ్లినట్లు ఉంటుంది..
డెక్కన్ ఒడిస్సీ రైలు 16వ శతాబ్దపు మహారాజుల జీవనశైలిని గుర్తుకు తెచ్చేలా, లగ్జరీ క్యాబిన్లు, సౌకర్యాలతో గెస్ట్‌లను ఆకర్షిస్తుంది. ముదురు నీలం రంగులో కనిపించే ఈ రైలు ఎక్కిన తర్వాత, ఏదో రాజుల రథంలో వెళ్లినట్లు ఉంటుంది. ఈ రైలులో నిపుణులైన చెఫ్‌లు నడిపే మల్టీ క్యూసిన్ రెస్టారెంట్‌లతో పాటు మసాజ్ చేసే స్పా వరకు అన్ని సేవలు ఉంటాయి. ఈ రైలును ప్రస్తుతం తాజ్ గ్రూప్ మెయింటేన్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ నుంచి రైలు బయలుదేరి ఇండియాలోని విభిన్న నగరాలు, డెస్టినేషన్స్ కవర్ చేస్తూ జర్నీని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. ఈ రైలులో 7 రాత్రులు లేదా 8 రోజుల ట్రావెల్ ప్యాకేజీ ఉంటుంది. డీలక్స్ క్యాబిన్‌లో ఒకరికి 9,330 డాలర్లు, ఇద్దరికి 13,330 డాలర్లు కాగా ధర నిర్ణయించారు. ప్రెసిడెన్షియల్ సూట్ ప్యాసింజర్లు 20 వేల డాలర్లు చెల్లించాలి.

రాయల్ జర్నీకి కొత్త కోణం..
ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు.. నిజాంలు, రాజ్‌పుత్ర పాలకుల కాలం నుంచే రాయల్ జర్నీకి కొత్త కోణాన్ని అందించిన చరిత్రను సొంతం చేసుకుంది. తాజా ఈ రైలు కొత్త హంగులు దిద్దుకుని ప్రీమియం ఫెసిలిటీస్‌తో లాంచ్ అయింది. జైపూర్ నుంచి రైలు ప్రారంభమై.. రాజస్థాన్ వారసత్వాన్ని చూపిస్తుంది. డీలక్స్ క్యాబిన్‌ ట్రావెల్ ఛార్జ్ విదేశీయులకు ఒక్కొక్కరికి 10,507 డాలర్లు కాగా, భారతీయులకు రూ.8,61,700గా ఉంది.

స్వర్ణ రథం..
గోల్డెన్ చారియట్‌.. స్వర్ణ రథంగా పిలిచే ఈ రైలును కర్నాటక రాష్ట్ర పర్యటక విభాగం నిర్వహిస్తోంది. మైసూర్ శైలి డిజైన్‌తో కూడిన ఇంటీరియర్ రాయల్ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. గౌర్మెట్ డైనింగ్, ఆయుర్వేద స్పా ట్రీట్‌మెంట్స్ దీని స్పెషాలిటీ. 11 క్యాబిన్‌లలో ఒక్కోదానికి ఒక్కో రాజవంశం పేరు ఉంటుంది. బెంగళూరు నుంచి ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ రాయల్ ట్రైన్ ప్యాసింజర్లకు చారిత్రక ప్రదేశాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలు, పచ్చని ప్రకృతి అందాలను చూపిస్తుంది. 5 రాత్రులు/ 6 పగళ్లకు డీలక్స్ క్యాబిన్‌లో ట్రావెల్ చేసేందుకు 4,740 డాలర్లు చెల్లించాలి.

READ ALSO: Top Hedlines @5PM : టాప్‌ న్యూస్‌

Exit mobile version