Here is Best Tips To Increase Bike Mileage: ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్.. భారత ఆటో మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. బజాజ్, టీవీఎస్, హీరో కంపెనీలకు చెందిన పలు మోడళ్లు అధిక మైలేజ్‌ను ఇస్తాయి. సామాన్య ప్రజలు కూడా ఈ అధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లనే కొంటారు. అయితే కొన్నిసార్లు బైక్ మైలేజ్ బాగా తగ్గిపోతుంది. ఇందులో బైక్ నడిపే వారి తప్పు కూడా ఉంటుంది. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మెరుగైన మైలేజీని పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఓసారి చూద్దాం.
సర్వీసింగ్:
బైక్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేసుకోవాలి. ఇది బైక్ యొక్క పని తీరును బాగా ఉండేలా చేస్తుంది. దీని వల్ల మైలేజీ కూడా బాగా వస్తుంది. ఎయిర్ ఫిల్టర్, టైర్ ప్రెజర్ మరియు ఇంజన్ ఆయిల్ క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మంచిది. దాదాపుగా బైక్‌లను 2000 కిలోమీటర్లకు ఓసారి సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది బైక్ మోడల్ బట్టి మారుతుంటుంది.
స్మార్ట్ రైడింగ్:
రైడింగ్ టెక్నిక్ కూడా మైలేజీని ప్రభావితం చేస్తుంది. సరైన రైడింగ్ టెక్నిక్‌తో మీరు మంచి మైలేజీని పొందవచ్చు. స్మార్ట్ యాక్సిలరేషన్, ఆగి ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆఫ్ చేయడం, లో టైర్ ప్రెషర్, స్పీడ్ మైంటైన్ చేయడం వలన అధిక మైలేజీని పొందవచ్చు.
అతివేగం:
అతివేగం ప్రమాదకరమే కాకుండా మైలేజీపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఓవర్ స్పీడ్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది. దాంతో మైలేజీ తగ్గిపోతుంది. అందువల్ల ఎల్లప్పుడూ వేగంతో డ్రైవ్ చేయొద్దు.
Also Read: Gujarat Rains 2023: గుజరాత్‌లో వడగండ్ల వాన.. 20 మంది మృతి!
మన్నిక కల పెట్రోల్:
మన్నిక కల పెట్రోల్ విగియోగించాలి. నాణ్యతలేని పెట్రోలు వినియోగించడం ద్వారా మైలేజ్ తగ్గిపోవడంతో పాటు ఇంజన్, బోర్ రెండు పాడైపోతాయి.
బ్రేకింగ్‌ను తగ్గించండి:
అనవసరంగా బ్రేకింగ్ (బ్రేక్) చేయకూడదు. బ్రేకింగ్‌ను తగ్గించడానికి ప్రయత్నించండి. అయితే అవసరమైతే బ్రేకులు వేయండి. దీనితో పాటు మీ వేగాన్ని అదుపులో ఉంచండి. ద్విచక్ర వాహనదారులు 50 నుంచి 55 మధ్యలో స్పీడ్ మైంటైన్ చేస్తూ.. సరైన సమయంలో ఆయిల్ చేంజ్ చేయించుకుంటే మంచి మైలేజ్ వస్తుందని మెకానిక్స్ చెబుతుంటారు.