NTV Telugu Site icon

TomTom Traffic Index : ట్రాఫిక్ లోనే గడిచిపోతున్న జీవితం.. ఈ నగరాల్లో మరీ ఎక్కువ

Traffic Jam

Traffic Jam

TomTom Traffic Index :ట్రాఫిక్ జామ్ ఈ పేరు వింటేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. లేదంటే అద్దెకు అయినా వాహనాలను తీసుకుంటున్నారు. దీంతో నగరాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడం కంటే నడిచి వెళ్లిపోతేనే త్వరగా వెళ్లిపోతాం అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రపంచం నగరాల్లోని ట్రాఫిక్ జామ్ లపై ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022’  ఓ సంస్థ తాజాగా నివేదికను విడుదల చేసింది. 56 దేశాల్లోని 390 నగరాల్లో మెట్రోపాలిటిన్ ప్రాంతంలోని డ్రైవర్ల నుంచి సేకరించిన ట్రిప్ డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఆ సంస్థ. ఈ నివేదిక పరిశీలిస్తే ట్రాఫిక్ జామ్ లోనే ఇంత సమయం అయిపోతుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. సగానికి పైగా జీవితం ఇక్కడే గడిపోతుందిగా అని దిగులేస్తుంది.

Also Read: Rajasthan Assembly Election: రాజస్థాన్ అసెంబ్లీ ముఖ చిత్రాన్ని మారుస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు

ఈ ట్రాఫిక్ జామ్ అధికంగా ఉండే జాబితాలో బ్రిటన్ దేశంలోని లండన్ నగరం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అక్కడ కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సగటున 36 నిమిషాల 20 సెకన్లు పడుతున్నట్టు నివేదిక పేర్కొంది. దీనిని బట్టి చూస్తే ఏడాదికి 325 గంటలు ట్రాఫిక్‌లోనే జీవితం గడచిపోతోందన్నమాట. ఇక ట్రాఫిక్ జామ్ వల్ల కేవలం సమయం మాత్రమే కాదు డబ్బు కూడా చాలా వరకు వేస్ట్ అవుతుంది. ఇలా ట్రాఫిక్ జామ్ లో ఉండటం వల్ల ఇంధన వినియోగం కూడా భారీగా పెరుగుతుంది. హాంకాంగ్ లో

ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల్లో ఇక్కడి డ్రైవర్లు ప్రతిరోజు 1000 డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తేలింది. అత్యధిక ఇంధన వినియోగం కారణంగా హాంకాంగ్ డ్రైవర్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఫలితంగా హాంకాంగ్ ఖరీదైన నగరంగా మారిపోయింది. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లండన్ తరువాత ట్రాఫిక్ జామ్ అధికంగా ఉండే నగరాల్లో భారత్ కు చెందిన నగరం చోటు సంపాదించుకుంది. బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 29 నిమిషాల 10 సెకన్లు పడుతోంది. దీని కారణంగా ఇది ట్రాఫిక్ అధికంగా ఉంటే ప్రాంతాల్లో బెంగుళూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక బెంగుళూరుతో పాటు టాప్ 10 లో చోటు దక్కించుకుంది పూణె నగరం. పూణెలో 10 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి  27 నిమిషాల 20 సెకన్లు పడుతోందట. పూణె ఈ జాబితాలో ఆరోస్థానంలో నిలిచింది.