రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర వ్తాప్తంగా నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను రేపు విడుదల చేయడానికి అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేశారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే అడ్మిషన్‌కి అర్హత ఉండేది. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఎంసెట్‌లో క్వాలిఫై అయితే చాలు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంసెట్‌లో ఇంటర్ మార్క్‌ల వెయిటేజ్‌ను సైతం రద్దు చేశారు. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే.