Site icon NTV Telugu

Ravi kishan: మరో వివాదంలో చిక్కుకున్న బన్నీ విలన్ ..

Raviii

Raviii

తెలుగు విలన్ రవికిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో విలన్ గా నటించాడు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన రవి కిషన్ రేసుగుర్రం చిత్రంలో శివారెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు… ఆ సినిమా క్రేజ్ తోనే మరిన్ని హిట్ సినిమాల్లో నటించారు. విలన్ గా మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా ఈయన ప్రజల ఆదరణతో ముందుకు సాగుతున్నాడు..

ఇప్పుడు తాజాగా లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రవి కిషన్ ఒక వివాదంలో చిక్కుకున్నాడని తెలుస్తుంది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. తాజాగా ఓ మహిళ రవికిషన్ తన భర్త అంటూ మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తుంది… ఆమె బిడ్డను తన బిడ్డగా రవికిషన్ సమాజానికి పరిచయం చెయ్యాలని డిమాండ్ చేస్తుంది..

వివరాల్లోకి వెళితే.. లక్నోకి చెందిన అపర్ణ ఠాకూర్ తన కూతురు షెనోవాతో కలిసి మీడియాతో మాట్లాడారు.. తమకు వివాహం అయిందని సమాజానికి తన కూతురుగా నా బిడ్డను పరిచయం చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేసింది.. రవి కిషన్ కు షెనోవా కూతురుగా ఉండే హక్కు ఉందని ఆమె చెబుతున్నారు. అలాగే తన కూతురితో కలిసి రవి కిషన్ ఉన్నప్పటి ఫోటోలు కూడా ఆమె చూపించారు. ఒకవేళ ఆయన తన కూతుర్ని కూతురిగా అంగీకరించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని కూడా స్పష్టం చేశారు. ఈ వార్త నిజమైతే రవికిషన్ రాజకీయ భవిష్యత్ ఆదిలోనే అంతం అవుతుందని మరో వార్త వినిపిస్తుంది.. ఏది ఏమైనా దీని పై క్లారిటీ రావాలంటే రవికిషన్ స్పందించేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Exit mobile version