తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సక్సెస్ రేటును అందుకున్న సినిమాల కన్నా ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాలు ఎక్కువగా నెగిటివ్ టాక్ ను అందుకున్నాయి.. అధిక శాతం చిన్న సినిమాలే హిట్ అవ్వడం , పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ కుదేలు అయ్యింది.. ఏ హీరో సినిమాలు హిట్ అయ్యాయో, ఏ హీరో సినిమా ప్లాప్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం..
2023 ఏడాది ప్రారంభంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పెద్ద హిట్ అయ్యి దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాతో పోటీకి వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ కూడా 80 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి కొత్త ఏడాది హ్యాట్రిక్ హిట్స్ ను అందుకున్నాయి.. ఆ తర్వాత భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు జనాలను అంతగా ఆకట్టుకోలేక పోయాయి..ప్రభాస్ ‘ఆదిపురుష్’ మరియు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.. కానీ అవి రెండు నిరాశ పరిచాయి..
ఇక ఈ ఏడాది భారీగా టికెట్లు అమ్ముడు పోయిన సినిమాలను చూస్తే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు కోటి 20 లక్షల రూపాయిల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ ఏడాది కి టాలీవుడ్ కి ఇదే హైయెస్ట్ అట. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరో నటించిన ఆదిపురుష్ చిత్రం నిల్చింది.. ఏకంగా 90 లక్షల టిక్కెట్లు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.. బ్రో ది అవతార్ చిత్రం 82 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయి మూడవ స్థానం లో నిల్చింది.. ఆ తర్వాత బాలయ్య బాబు వీరసింహారెడ్డి సినిమాకు 70 లక్షల టిక్కెట్లు అమ్ముడు పోయినట్లు సమాచారం.. ఇక వచ్చే ఏడాది ఏ సినిమాకు ఎన్ని టిక్కెట్లు అమ్ముడు పోతాయో చూద్దాం..
