Nadiminti Narasinga Rao: టాలీవూడ్ లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒకరోజు’, కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’ సినిమాలతోపాటు అనేక తెలుగు సినిమాలకు మాటల రచయిగా సేవలు అందించిన నడిమింటి నరసింగరావు (72) తాజాగా కన్నుమూశారు. ఆయన గత కొద్ది కాలం నుండి అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (బుధవారం) కన్నుమూశారు. ఇకపోతే గులాబీ, అనగనగా ఒక రోజు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతగా ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ సినిమాలలోని డైలాగ్స్ కూడా మంచి అదరణని పొందాయి. ఇప్పటికి యూట్యూబ్ లో ఆ డైలాగ్స్ కోసమే సినిమాలను చూసే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలంటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది నరసింగరావు.
Khushboo: ఖుష్బూకి గాయం.. అసలేమైంది?
గత కొద్ది కాలంగా నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో సోమాజిగూడలో ఉన్న యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే., పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే ఆయన కోమాలోకి వెళ్లారు. ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశమ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసింగరావుకి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. నడిమింటి నరసింగరావు పాతబస్తీ, ఊరికి మొనగాడు,కుచ్చికుచ్చి కూనమ్మా లాంటి పలు సినిమాలకి ఆయన మాటల రచయితగా పని చేసారు. ఈయన పలు సినిమాలకే కాకుండా సీరియల్‌కి కూడా రచయితగా పనిచేసారు. సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.