Site icon NTV Telugu

Tollywood Bundh : టాలీవుడ్ సినీ కార్మికుల 12వ రోజు సమ్మె అప్డేట్

Tollywood

Tollywood

టాలీవుడ్ లో 12వ రోజు షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఫెడరేషన్ , ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. నిన్న నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్ లో చర్చించారు కార్మిక సంఘాలు. మరోవైపు నిన్న ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు సమావేశం అయ్యారు. శనివారం సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను మరోసారి చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. నిర్మాతలు అర్ధం లేని ప్రతిపాదనలు చేస్తు కావాలనే కాలయాపన చేస్తున్నారు అంటున్నారు ఫెడరేషన్ నాయకులు.

నిర్మాతలు పెట్టిన కండిషన్స్ లో డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు విభాగాలకు వేతనాలు పెంచకపోవడంతో ఫెడరేషన్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసున్నారు. ఈ మూడు యూనియన్ లకు తప్పించి మిగతా యూనియన్ సభ్యులకు రూ. 2000 వేలు లోపు ఉన్న కార్మికులకు 3 సంవత్సరాలకు 25 శాతం వేతనాలు పెంచుతామని నిర్మాతలు తెలిపారు. నిర్మాతల కండిషన్స్ ప్రకారం వాళ్ళు పెంచుతాము అన్న 25 శాతం వేతనాలు మాకు వర్కౌట్ కాదని ఫెడరెషన్ నాయకులు అభ్యనంతరం వ్యక్తం చేసారు. నిర్మాతలు పెట్టిన నాలుగు కండిషన్స్ కు ఫెడరేషన్ ఒప్పుకుంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు తేల్చి చెప్పారు. ఆ మూడు యూనియన్స్ కుడా వేతనాలు పెంచి మేము అడిగిన 30 శాతం పెంచితే సమ్మె విరమణ చేస్తామని ఫెడరేషన్ నాయకులు బదులిచ్చారు. నిర్మాతలు పెట్టిన మిగతా కండిషన్ లు దశల వారీగా అమలు చేస్తామన్నారు ఫెడరేషన్ నాయకులు. దీనిపై ఇరువురికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నారు. మరో రెండు, మూడు సార్లు చర్చలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version