Site icon NTV Telugu

Exclusive : టాలీవుడ్ సినిమాలకు ఓటిటి టెన్షన్స్.. విడుదలపై ప్రభావం

Tollywood

Tollywood

టాలీవుడ్‌లో సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. స్టార్ హీరోల సినిమాలు దగ్గర నుండి టైర్ 3 హీరోల సినిమాల వరకు ప్రస్తుతం అనేక సినిమాలు ఓటిటి డీల్స్ ఆలస్యమవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గతంలో సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఓటిటి ప్లాట్‌ఫామ్‌లతో డీల్ త్వరగా క్లోజ్ అవుతుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చాలా సినిమాలకు ఓటిటి ఒప్పందాలు త్వరగా కుదరకపోవడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.

Also Read : Dhurandhar – 2 : ధురంధర్ 2’ ఏకంగా 45 దేశాల్లో సంచలనం..

ఓటిటి డీల్స్ ఆలస్యం కావడంతో నిర్మాతలు మిడిల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నారు. వారి ద్వారా ముందుగా కొంత డబ్బు తెచ్చుకుని సినిమా పనులు స్టార్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలా తీసుకున్న డబ్బులపై వడ్డీలు పెరుగుతూ ఉండటంతో నిర్మాతలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. మరోవైపు, ఓటిటి డీల్ క్లోజ్ కాకుండా సినిమా విడుదలకు క్లియరెన్స్ కూడా రాకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఓటిటి ఒప్పందం పూర్తయ్యాకే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభిస్తోంది. ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే సినిమాను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మితమవుతున్న లేదా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలలో దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ సినిమాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఓటిటి మార్కెట్ పరిస్థితి సినిమా విడుదలలపై నేరుగా ప్రభావం చూపుతోందని చెప్పాలి. ఓ స్టార్ హీరో సినిమా అయితే ఇప్పుడో షూట్ ఫినిష్ చేసుకుని కూడా ఓటీటీ డీల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందంటే సిచుయేషన్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవాలి.

Exit mobile version