టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, చందూమొండేటి బాలీవుడ్ ఫ్లాప్ హీరోల వెంటపడుతున్నారు. వారిసు బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత వంశీపైడిపల్లి ఓ కథను సిద్దం చేసి రజనీకాంత్, సూర్యకు వినిపించాడు. తమిళ హీరోలు కాదనడంతో అమీర్ ఖాన్ దగ్గరకు ఈ స్క్రిప్ట్ చేరింది. కానీ చివరకు సల్మాన్ ఖాన్ యస్ చెప్పడంతో.. రీసెంట్లీ మూవీ పట్టాలెక్కింది. నయనతార హీరోయిన్‌గా ఫిక్సైన ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న కండల వీరుడు ఈ సినిమాతో ఇటు నార్త్ , ఇటు సౌత్ టార్గెట్ చేయాలనుకుంటున్నాడు.
తండేల్‌తో నాగచైతన్య ఖాతాలో బిగ్ హిట్టేసిన చందూమొండేటి..మైథాలజీ యానిమేషన్ చిత్రం వాయుపుత్రకు కమిటయ్యాడు. నాగ వంశీ నిర్మాతగా ఈ 3డీ ఫిల్మ్ తెరకెక్కించాలనుకున్నారు. కానీ బడ్జెట్ ఊహించినదాని కన్నా పెరగడంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఎప్పుడో సిద్ధం చేసుకున్న హిస్టారికల్ థ్రిల్లర్ కథతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడట. సూర్యకు కథ వినిపించాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇంతలో వాయుపుత్ర ఆఫర్ వచ్చింది. ఇది హోల్డ్ కావడంతో పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. 300 ఏళ్ల క్రితం నాటి కథతో.. ఉజ్జయినీ బ్యాక్ డ్రాప్‌లో ఓ కథను సిద్ధం చేశాడు చందు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ అండ్ రానాతో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. గత కొంత కాలంగా అక్షయ్ హిట్ లేక స్ట్రగుల్ పడుతున్నాడు. తాజాగా వచ్చిన భూత్ బంగ్లా ఓకే అనిపించుకుంది కానీ ఈ వారం గడిస్తే హిట్టా ఫట్టా తేలిపోనుంది. ఇక రానా కొంతకాలంగా విలన్ అండ్ క్యామియో రోల్స్‌కు పరిమితమౌతున్నాడు. ఇక ఇందులో మరోస్టార్ నటించబోతున్నాడని తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మించేందుకు ముందుకు వచ్చాడట. మరింత అప్డేట్ రావాల్సి ఉంది. అయితే ఇటు నిఖిల్ కార్తీకేయ3 ఈ ఏడాది చివరిలో స్టార్ట్ అవుతుందని చెప్పాడు. మరీ ఏ సినిమా మొదలు పెడతాడో చందు మొండేటి.
