Site icon NTV Telugu

Director N Shankar : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో తీవ్ర విషాదం

N Shankar’s Mother Passes

N Shankar’s Mother Passes

తెలుగు దర్శకుడు ఎన్. శంకర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నిమ్మల సక్కుబాయమ్మ (78) వృద్ధాప్య సమస్యల కారణంగా బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఇప్పటికే వరుస మరణాలతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకోగా, ఇప్పుడు శంకర్ గారి మాతృమూర్తి మరణవార్త విన్న సినీ ప్రముఖులు , అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శంకర్ కి తన తల్లి అంటే ఎంతో ఇష్టమని, ఆమె ఆశీస్సులతోనే ఆయన సినీ రంగంలో ఈ స్థాయికి చేరుకున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Also Read : Sushmita Konidela : అక్క సుస్మితకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చరణ్ ..

ఆమె మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు శంకర్ కి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. సక్కుబాయమ్మ అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో జరగనున్నాయి. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక గొప్ప దర్శకుడిగా శంకర్ ఎదిగే క్రమంలో తల్లిగా ఆమె అందించిన ప్రోత్సాహం ఎంతో ఉందని సినీ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Exit mobile version