నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ పతనం కనపడడంతో.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా దిగువకు పడిపోయాయి. ఈ దెబ్బకి మార్కెట్ లో ఆల్ రౌండ్ క్షీణత స్పష్టంగా కనపడుతోంది. నేడు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లో దాదాపు 4 శాతం మేర నష్టపోయింది. ఇదే తరహా నిఫ్టీ మిడ్ క్యాప్ లో కనపడుతోంది. ఇక్కడ కూడా 4 శాతానికి పైగా నష్టపోయింది. నేడు వార్తలు అందేసరికి సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లు పైగా నష్టపోయి.. 72,930 వద్ద ట్రేడ్ అవుతుంది.
Read Also: Ghost Dreams: కలలో దెయ్యాలు పీడిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. అదే కారణం.. ?
ఇక మరోవైపు నిఫ్టీ 250 పాయింట్ల వరకు క్షీణించి 22,060 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంకోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 240, 1890 పాయింట్లు నష్టపోయాయి. అలాగే సెక్టోరల్ ఇండెక్స్ లో చూస్తే కేవలం ఎఫ్‌ఎంసీజీ మాత్రమే లాభాలలో ఉంది. నేటి ట్రేడింగ్ లో టాప్ లూజర్లలో అదానీ ఎంటర్‌ప్రైస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టిపీసి, కోల్ ఇండియాలు ఉండగా.. అదే మాదిరి టాప్ లాభాల స్టాక్స్ చూస్తే ఐటిసి, కోటక్ మహీంద్రా, ఐసీసీఐ బ్యాంక్, బ్రిటానియా, నెస్లేలు వరుసగా ఉన్నాయి.
Read Also: Minister Jogi Ramesh: జగన్ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు- పవన్- బీజేపీ కుట్ర
ఇక దీనికి కారణం గత నెలలో దేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం రేట్ స్వల్పంగా తగ్గడంతోపాటు.. సహా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గణాంకాలు తగ్గడం లాంటి అనేక అంశాలు ప్రతికూల పరిస్థితులని సూచించాయి. ఇవేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న పరిస్థితులు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ల పై తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థం అవుతుంది.