NTV Telugu Site icon

Today Stock Market Roundup 26-04-23: ఈ క్యాలెండర్ ఇయర్‌లో రికార్డు స్థాయిలో రాణించిన ‘‘సీమెన్స్’’

Today Stock Market Roundup 26 04 23

Today Stock Market Roundup 26 04 23

Today Stock Market Roundup 26-04-23: ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నం స్వల్ప లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో వ్యాపారం నీరసంగా సాగింది. కాకపోతే.. సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు లాభాలతో ఎండ్ కావటం చెప్పుకోదగ్గ అంశం.

read more: Rice Shortage: ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 21 కంపెనీలు, నిఫ్టీలోని 50 సంస్థల్లో 33 సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. పవర్ గ్రిడ్, నెస్లె ఇండియా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌యూఎల్ వంటి కంపెనీలు పెర్‌ఫార్మెన్స్‌లో ముందు వరుసలో నిలిచాయి.

సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగి 60 వేల 300 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 17 వేల 813 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. రంగాల వారీగా చూసుకుంటే.. ట్రావెల్ మరియు టూరిజం బిజినెస్ మెరిసింది. సమ్మర్ హాలిడే సీజన్ ఈ రెండు రంగాలకు కలిసొచ్చింది.

మ్యాన్‌కైండ్ సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి ఇవాళ రెండో రోజు మధ్యాహ్నం మూడున్నర వరకు 52 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తయింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. సీమెన్స్ సంస్థ షేర్ వ్యాల్యూ ఈ క్యాలెండర్ ఇయర్‌లో రికార్డ్ స్థాయిలో 22 శాతం పెరగటం విశేషం. 10 గ్రాముల బంగారం ధర నామమాత్రంగా 79 రూపాయలు పడిపోయింది.

అత్యధికంగా 60 వేల 182 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 188 రూపాయలు పెరిగి గరిష్టంగా 74 వేల 416 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర అతిస్వల్పంగా 7 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 342 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 3 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 81 రూపాయల 91 పైసల వద్ద స్థిరపడింది.