NTV Telugu Site icon

Today Stock Market Roundup 13-04-23: వరుసగా 9వ రోజు.. లాభాలతో క్లోజు..

Today Stock Market Roundup 13 04 23

Today Stock Market Roundup 13 04 23

Today Stock Market Roundup 13-04-23: మన దేశ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా నాలుగో రోజు, మొత్తమ్మీద తొమ్మిదో రోజు కూడా లాభాలతో ముగిసింది. ఇవాళ గురువారం ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావటంతో వరుస లాభాలకు బ్రేక్ పడింది.

read more: Cinema to the people: ప్రజల వద్దకు సినిమా. ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. ఇంట్లోనే చూసేందుకు ఏపీలో ఏర్పాట్లు

కానీ.. ట్రేడింగ్ చివరి సెషన్‌లో ఫైనాన్షియల్ స్టాక్స్ కొనుగోళ్లు పెరగటం కలిసొచ్చింది. పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఏసియన్ పెయింట్స్ మరియు ఐటీసీ షేర్లు రాణించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని సపోర్ట్ చేసింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ 3 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.

సెన్సెక్స్ 38 పాయింట్లు పెరిగి 60 వేల 431 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 17 వేల 828 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 18 కంపెనీలు రాణించగా మిగతా 12 కంపెనీలు నేల చూపులు చూశాయి. బీఎస్ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్‌గ్రిడ్ మెరిశాయి.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మంచి పనితీరు కనబరిచిని స్టాక్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐషర్ మోటర్, అపోలో టాప్‌లో నిలిచాయి. 10 గ్రాముల బంగారం రేటు 275 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 60 వేల 903 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 373 రూపాయలు పెరిగింది.

గరిష్టంగా 76 వేల 286 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు 9 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 806 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 97 పైసల వద్ద స్థిరపడింది.