Today Stock Market Roundup 12-04-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలో వరుసగా మూడో రోజు, మొత్తమ్మీద ఎనిమిదో రోజు లాభాలతో ముగిసింది. ఇవాళ బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన రెండు కీలక సూచీలు ఎర్లీ ట్రేడింగ్‌లో వచ్చిన నష్టాలను ఇంట్రాడేలో అధిగమించాయి.
సాయంత్రానికి చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాయి. మార్చి నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని పెంచగలిగాయి. దీంతో.. ఒక వైపు.. సెన్సెక్స్, మరో వైపు.. బంగారం 60 వేలకు పైగానే పరుగులు తీస్తూ పోటీపడుతున్న వాతావరణం కనిపిస్తోంది.
read more: World Worst Currency no-3: ప్రపంచంలోనే 3వ అతి చెత్త కరెన్సీగా రూబుల్
సెన్సెక్స్ 235 పాయింట్లు పెరిగి 60 వేల 392 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 17 వేల 812 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 17 కంపెనీలు లాభాలు పొందగా మిగతా 13 కంపెనీలు నేలచూపులు చూశాయి.
బీఎస్ఈలో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్ మెరిశాయి. యాక్సిస్ బ్యాంక్, మారుతీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ వెనకబడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మరియు స్మాల్ క్యాప్ 100 సూచీలు బాగా రాణించాయి. సున్నా పాయింట్ నాలుగు శాతం చొప్పున లాభాలు పొందాయి.
రంగాల వారీగా చూసుకుంటే నిఫ్టీ మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు సున్నా పాయింట్ 3 శాతం వరకు నష్టపోయాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. సూలా వైన్‌యార్డ్స్ షేర్లు 11 శాతం పెరిగాయి. మరోవైపు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్స్ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 135 రూపాయలు పెరిగింది.
గరిష్టంగా 60 వేల 640 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 331 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 75 వేల 442 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా 21 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 703 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 4 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 8 పైసల వద్ద స్థిరపడింది.