T20 World Cup: కొన్నాళ్లుగా భారత మహిళల జట్టుకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచకప్ కు అడుగుదూరంలో హర్మన్‌ప్రీత్ సేన ఉంది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత మెగా ఈవెంట్ ఫైనల్లో మన ‘ప్రపంచకప్’ కలని కలగానే మిగిల్చింది. మళ్లీ బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ‘స్వర్ణ’వకాశాన్ని ఎగరేసుకు పోయింది. ఈ రెండు ఫైనల్స్‌లో ఓడిన భారత్ చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హర్మన్‌ప్రీత్ సేనకు మళ్లీ ఆసీస్ ను దెబ్బతీసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సమష్టిగా కృషి చేస్తే ఆసీస్‌ను దెబ్బకొట్టి ఫైనల్ పోరుకు అర్హత సాధిచొచ్చు.
భారత అమ్మాయిలు రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్ చేతికి అందుతుంది. ఇందులో మొదటి అడుగు వేసేందుకు భారత మహిళల జట్టు నేడు ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఫిబ్రవరి 23న గురువారం టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి టాస్ 6 గంటలకు ఉంటుంది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ పాత్ర కూడా కీలకం కానుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఫైనల్స్‌కు చేరుకుని గతంలో ఆస్ట్రేలియాతో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవచ్చు.
Read Also: Bill Gates: భారతదేశం నాకు భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోంది.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమ్ ఇండియా ప్రపంచకప్ ఆశలు మొదలయ్యాయి. ఈ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. దీంతో టీమిండియా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత మ్యాచ్ లో విండీస్‌పై టీమిండియా విజయం సాధించింది. వెంటనే మూడో మ్యాచ్ ఇంగ్లండ్‌తో జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ భారత్ విజయానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది.
ఇప్పుడు సిరీస్‌లో నాలుగో, చివరి మ్యాచ్ ఐర్లాండ్‌తో జరిగింది. సెమీ ఫైనల్స్ పరంగా ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కీలకం. కీలకమైన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా సెమీ ఫైనల్ టిక్కెట్‌ను ఖాయం చేసుకుంది.
వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, జామీ రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దీప్తి శర్మ, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రిచా ఘోష్, యాస్తికా భాటియా, అంజలి సార్వాణి, మేఘనా సింగ్, రాధా యాద్వద్ సింగ్ , రేణుకా సింగ్ మరియు శిఖా పాండే.
Read Also: Earthquake: తజకిస్తాన్‌లో భారీ భూకంపం..
ఆస్ట్రేలియా జట్టు : బెత్ మూన్, గ్రేస్ హారిస్, మెగ్ లానింగ్ (కెప్టెన్), అన్నాబెల్లె సదర్లాండ్, ఆష్లే గార్డనర్, ఎలిస్ పెర్రీ, హీథర్ గ్రాహం, జెస్ జాన్సెన్, కిమ్ గార్త్, తహిలా మెక్‌గ్రాత్, అలిస్సా హీలీ, అలనా కింగ్, డార్సీ బ్రౌన్, జార్జియా వేర్‌హామ్ మరియు మేగాన్ స్కూట్.