Man Dragged By Mini Bus in Delhi: మినీ బస్సును ఆపేందుకు ఓ యువకుడు ఏకంగా బానెట్ పైకి ఎక్కినా.. ఇదేమీ పట్టించుకోని డ్రైవరు వాహనాన్ని ఆపకుండా 4 కిమీ దూసుకెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ 3లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల ప్రకారం… ఆదివారం రాత్రి విక్కీ కుమార్ అనే యువకుడు తన ట్రక్కులో డ్రైవరుతో కలసి నోయిడా వైపు వెళుతున్నాడు. ఓ మినీ బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసే యత్నం చేసింది. ఈ క్రమంలో లజ్‌పత్ నగర్‌లో ట్రక్కు వెనుక భాగంను మినీ బస్సు ఢీకొట్టింది. దీంతో ట్రక్కు నుంచి కిందకు దిగిన విక్కీ.. మినీ బస్సు డ్రైవరును కిందకు దిగాలంటూ హెచ్చరించాడు. అయితే మినీ బస్సు డ్రైవరు వాహనాన్ని ముందుకు పోనిస్తుండటంతో.. అతడిని అడ్డగించేందుకు విక్కీ బానెట్‌పైకి ఎక్కాడు.
Also Read: SA vs IND 2nd ODI: నేడు దక్షిణాఫ్రికా, భారత్ రెండో వన్డే.. శ్రేయస్ స్థానంలో ఎవరు?
విక్కీ కుమార్ మినీ బస్సు బానెట్‌పై ఉన్నా.. వాహనాన్ని డ్రైవరు ఆపలేదు. అలాగే సుమారు 4 కిమీ ముందుకు పోనిచ్చాడు. ఈ సమయంలో విక్కీ బానెట్‌ను పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత మినీ బస్సును డ్రైవరు ఆపడంతో విక్కీ కిందకు దిగాడు. ఇదే అదనుగా బావింవిన బస్సు డ్రైవరు.. అక్కడినుంచి వేగంగా వాహనంలో పారిపోయాడు. ఇందుకు ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవరుకు కాల్ చేసి సంప్రదించగా తాను ఉత్తరప్రదేశ్‌లో ఉన్నానని, తాను ఇప్పుడు రాలేనని చెప్పాడు. ఆ వ్యక్తిని ఢిల్లీకి రమ్మని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకసారి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ పొలిసు అధికారి తెలిపారు.
Visuals of a man allegedly hit by minibus and dragged on its bonnet for some distance in south Delhi’s Lajpat Nagar area.
PCR call received around 11:30 pm on Sunday. The caller alleged that while going from #DNDFlyover towards #Noida, the driver of a minibus hit him in… pic.twitter.com/0uUeXmuvQt
— Hate Detector 🔍 (@HateDetectors) December 18, 2023