NTV Telugu Site icon

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?

Gold

Gold

బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఈరోజు కాస్త జనాలకు ఊరట కలిగిస్తున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. అయితే బుధవారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 56,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది… కిలో వెండిపై సుమారు రూ. 300 మేర తగ్గింది.. ఈరోజు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,000 గా ఉన్నాయి..

* ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,700కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,850వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,350గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 56,700కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850గా ఉంది. ఇక మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో ఇదేధరలు నమోదు అవుతున్నాయి..

* ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం తగ్గితే.. వెండి కూడా అదే దారిలో నడిచింది.. కిలో పై రూ.300 తగ్గగా..రూ. 75,300కి చేరింది. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో కిలో వెండి రూ. 78,200కాగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,300 వద్ద కొనసాగుతోంది.. ఇక హైదరాబాద్ లో రూ.78,200 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..