నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ షాకిచ్చాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 760 పెరిగింది. దీంతో తులం పసిడి ధర రూ. లక్షా ఏడు వేలు దాటింది కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,762, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,865 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో రూ.98,650 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగింది. దీంతో రూ. 1,07,620 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:కేవలం 5.95mm మందం, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, డైనమిక్ లైట్ డిజైన్‌తో TECNO POVA Slim 5G లాంచ్!
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,07,770 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,36,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,26,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
