Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు నాటో కూటమిలోకి ఫిన్లాండ్‌

* ఐపీఎల్‌లో నేడు ఢిల్లీతో తలపడనున్న గుజరాత్‌.. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

* హైదరాబాద్‌: నేడు సిట్‌ కస్టడీకి TSPSC లీకేజ్‌ కేసు నిందితులు

* తిరుమల: శ్రీవారి వసంతోత్సవాల్లో రోండోవ రోజు.. ఇవాళ ఉదయం 8 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవనున్న శ్రీవారు, రేపటితో ముగియనున్న వార్షిక వసంతోత్సవాలు.. ఎల్లుండి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃరుద్ధరణ

* తిరుమల: రేపు, ఎల్లుండి తుంభుర తీర్థ ముక్కోటి.. రేపు ఉదయం నుంచి ఎల్లుండి మధ్యహ్నం వరకు తుంభూర తీర్దానికి భక్తులును అనుమతించనున్న టీటీడీ.. వయోవృద్దులు, ఆరోగ్యపరమైన సమస్యలు వున్నవారికి తుంభూర తీర్దానికి అనుమతి నిరాకరణ.. రేపు, ఎల్లుండి పాపవినాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులును మాత్రమే అనుమతించనున్న టీటీడీ

* ప్రకాశం : దోర్నాలలో వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..

* ప్రకాశం : చీమకుర్తి హరిహర క్షేత్రం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక అనుగ్రహ బాషిణం, హాజరుకానున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, ఆలయ ధర్మకర్త మాజీ మంత్రి శిద్దా రాఘవరావు..

* కడప : వైభవంగా సాగుతున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. ఐదవ రోజు మోహినీ అలంకారంలో దర్శనం ఇవ్వనున్న కోదండ రాముడు.. రాత్రి గరుడ వాహనంపై ఊరేగనున్న ఒంటిమిట్ట రాముడు

* అంబేద్కర్ కోనసీమ: రామచంద్రపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి వేణు

* పల్నాడు: ఈనెల 6న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన… చిలకలూరిపేట నియోజకవర్గంలో ఫ్యామిలీ డాక్టర్స్ విధానాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్.. సీఎం పర్యటన సందర్భంగా నేడు ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి విడదల రజని,..

* బాపట్ల : భట్టిప్రోలులో వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున..

* తిరుపతి: కార్వేటి నగరం మండలంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ .. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు..

* తిరుపతి: నగరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి రోజా..

* కడప : నేటి నుంచి 14వరకు ప్రొద్దుటూరులో ముక్తిరామేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు..

* కడప : నేడు గ్రూప్ 4 కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 1726 మంది అభ్యర్థులు..

* కడప : నేడు శంకరాపురం స్కౌట్ హాల్లో మూడో విడత అసరా చెక్కులు పంపిణీ చేయనున్న డిప్యూటీ సిఎం అంజద్ బాషా.. జగనన్న మనభవిష్యత్ పై పార్టీ నేతలు, కార్యకర్తలతో అపూర్వ కళ్యాణ డిప్యూటీ సిఎం అధ్వర్యంలో మండపంలో సమావేశం..

* కడప : ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి భక్తుల సౌకర్యార్థం 118 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వెంకటాచలం లో జరిగే వైయస్సార్ ఆసరా.. అనంతరం పొదలకూరు మండలం లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* గుంటూరు: పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు లో మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన పునర్నిర్మాణం, హాజరుకానున్న కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి …

* గుంటూరు: నేడు వట్టి చెరుకూరు మండలం గారపాడు లో వైయస్సార్ జగనన్న భూహక్కు, భూ రక్షణ పథకం పై సదస్సు…

* అనంతపురం : 60వ రోజు యువగళం పాదయాత్ర.. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రాప్తాడు నుంచి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం. అనంతపురం టివి టవర్, విజయనగర్ కాలనీ, జ్యోతిరావ్ పూలే సర్కిల్, అంబేద్కర్ నగర్ సర్కిల్, పవర్ హౌస్ సర్కిల్, బసవన్న గుడి, విజయ క్లాత్ సెంటర్, సూర్యనగర్ మీదుగా సాగనున్న పాదయాత్ర

* శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటన.. ఉదయం 9.30 గంటలకు గార మండలం, కళింగపట్నం, కే మాత్సలేశం, బందరువానిపేట, వమరవిల్లి, వత్సవలస,తోనంగి గ్రామాల్లోని లబ్ధిదారులత మూడో విడత వైయస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నగరపాలక సంస్థ పరిధి, సిహెచ్ఎన్ కాలనీ, ఫాజుల్ బాగ్ పేట, గుజరాతిపేట 1,2, హయాతి నగర్, సీపననాయుడుపేటకి చెందిన లబ్ధిదారులతో వైయస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు

* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన.. ఉదయం 11:00 గంటలకు చాగల్లు మండలం చాగల్లు గ్రామం కాపు కళ్యాణ మండపంలో జరుగు వైఎస్సార్ ఆసరా 3 విడత చెక్కుల పంపిణీ, 11:45కి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరం అనం కళాక్షేత్రంలో జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు, సాయంత్రం 04:00 గంటలకు కొవ్వూరు టౌన్ లిటరరీ క్లబ్ లో జరుగు వైఎస్సార్ అసర 3 వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం, రాత్రి 07 గంటలకు చాగల్లు మండలం నందిగంపాడు గ్రామం లో రామాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి

Exit mobile version