NTV Telugu Site icon

Today Business Headlines 30-03-23: గౌతమ్‌ అదానీ.. బీ కేర్‌ఫుల్‌. లేకుంటే.. ఇంకా మునుగుతావ్‌. మరిన్ని వార్తలు

Today Business Headlines 30 03 23

Today Business Headlines 30 03 23

Today Business Headlines 30-03-23:

అసోచామ్‌ అధ్యక్షుడిగా

ఇండియాలోని ఇండస్ట్రియల్‌ అసోసియేషన్లలో ఒకటైన అసోచామ్‌కి ప్రెసిడెంట్‌గా అజయ్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం స్పైస్‌జెట్‌ సంస్థకు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అసోచామ్‌.. అంటే.. అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఆఫ్‌ ఇండియా అని అర్థం. ఈ సంఘం వందేళ్లకు పైగా సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు అధ్యక్షుడిగా సర్వీస్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అజయ్‌ సింగ్‌ తెలిపారు. ఇదిలాఉండగా.. అసోచామ్‌కి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా సంజయ్‌ నాయర్‌ వ్యవహరిస్తారు. ఈయన ప్రస్తుతం సోరిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ చైర్మన్‌గా ఉన్నారు.

సమంత పెట్టుబడులు

న్యూట్రిషన్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ.. ‘‘నరిష్‌ యు’’లో సినీ నటి సమంత పెట్టుబడులు పెట్టారు. అయితే.. ఎంత ఇన్వెస్ట్‌ చేశారనే విషయాన్ని మాత్రం ఈ కంపెనీ వెల్లడించలేదు. సీడ్‌ ఫండింగ్‌ ద్వారా 16 కోట్ల 50 లక్షల రూపాయలు సమీకరించగా.. అందులో సమంత పెట్టుబడులు కూడా ఉన్నట్లు తెలిపింది. డార్విన్‌ బాక్స్‌ కోఫౌండర్‌ రోహిత్‌ చెన్నమనేని, కిమ్స్‌ హాస్పిటల్స్‌ సీఈఓ అభినయ్‌ బొల్లినేని, జెరోధా కోఫౌండర్‌ నిఖిల్‌ కామత్‌ తదితరులు కూడా నరిష్‌ యులో ఇన్వెస్ట్‌ చేశారు. పాత కాలపు ఆహార పద్ధతులను ఈ తరానికి పరిచయటం చేయటంతోపాటు కొత్త ఉత్పత్తులనూ డెవలప్‌ చేస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి, సౌమ్యారెడ్డి తెలిపారు.

‘జోస్‌ అలుక్కాస్‌’కి..

ఆభరణాలను విక్రయించే సంస్థ జోస్‌ అలుక్కాస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్లుగా సెలెబ్రిటీలు మాధవన్‌ మరియు కీర్తి సురేష్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు వీళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జోస్‌ అలుక్కాస్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా మాధవన్‌ మరియు కీర్తి సురేష్‌ మాట్లాడుతూ.. జోస్‌ అలుక్కాస్‌ వంటి ప్రముఖ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని అన్నారు. జోస్‌ అలుక్కాస్‌ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది. ఇప్పటికే.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, కేరళ, పుదుచ్చెరిల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

అదానీ.. బీ కేర్‌ఫుల్‌

గౌతమ్‌ అదానీ గ్రూప్‌నకు ఇంటర్నేషనల్‌ రేటింగ్‌ ఏజెన్సీ.. ఫిచ్‌.. హెచ్చరిక జారీ చేసింది. గ్రూప్‌ స్పాన్సర్లు మరియు గ్రూప్‌లోని ఇతర సంస్థల అడ్మినిస్ట్రేషన్‌ లోపాలను, అసమర్థతలను సరిచేసుకోవాలని హితవు పలికింది. ఈ లోటుపాట్లను సరిదిద్దుకోకపోతే.. అదానీ ట్రాన్స్‌మిషన్‌ మరియు అదానీ పోర్ట్స్‌ వంటి కంపెనీల ఆర్థిక పరిస్థితులపై నెగెటివ్‌ ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చింది. ఈ రెండు సంస్థలకు బీబీబీ మైనస్‌ రేటింగ్‌ను కొనసాగించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్‌ కంపెనీల షేర్లను తనఖా పెట్టి తీసుకున్న 17 వేల 630 కోట్ల రూపాయల రుణాలను పూర్తిగా చెల్లించినట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది.

ఎయిరిండియా లోన్లు

ఎయిరిండియా తాజాగా 14 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరియు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి ఈ లోన్లు పొందింది. పాత రుణాలను రీఫైనాన్సింగ్‌ చేయటం మరియు కొత్త లోన్లు తీసుకోవటం ద్వారా ఈ నిధులను సమీకరించింది. ఇందులో 15 వందల కోట్ల రూపాయలను ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ కింద తీసుకుంది. ఈ స్కీమ్‌ని తొలిసారిగా కరోనా సమయంలో ప్రవేశపెట్టారు. చిన్న వ్యాపారాలకు సాయం చేసేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కానీ.. తర్వాత.. ఇతర రంగాలకు కూడా విస్తరించారు.

6 సంస్థలపై సెబీ బ్యాన్‌

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా.. సెబీ.. ఆరు ఎంటిటీలను క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి నిషేధించింది. ఈ లిస్టులో.. బాన్‌హెమ్‌ స్టాక్‌ బ్రోకింగ్‌, నింజా సెక్యూరిటీస్‌, కౌషల్‌ చందరణ, మనీష్‌ మెహతా, కాస్మీరా మెహతా మరియు సుమతీలాల్‌ మెహతా ఉన్నారు. తప్పుడు మార్గంలో సంపాదించిన రెండు కోట్ల 23 లక్షల రూపాయలను సెబీ వీళ్ల నుంచి స్వాధీనం చేసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మరియు తాము స్వాధీనం చేసుకున్న ఈ డబ్బును తిరిగి ఇచ్చేవరకు వీళ్లెవరూ కూడా తమ ఆస్తులను గానీ సెక్యూరిటీలను గానీ వెల్లడించటానికి వీల్లేదని సెబీ పేర్కొంది.