NTV Telugu Site icon

Today Business Headlines 20-04-23: రంజాన్‌కి ‘‘అన్‌లిమిటెడ్’’ ప్రత్యేక దుస్తులు. మరిన్ని వార్తలు

Today Business Headlines 20 04 23

Today Business Headlines 20 04 23

Today Business Headlines 20-04-23:

‘‘భాగ్య’’మంతుల నగరం

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్‌కి చోటు లభించింది. 97 నగరాలతో రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కి 65వ స్థానం దక్కింది. నగరంలో ఉంటున్న మిలియనీర్ల సంఖ్య 11 వేల ఒక వంద అని ఈ లిస్టును తయారుచేసిన హెన్లే అండ్ పార్ట్‌నర్స్ సంస్థ తెలిపింది. గడచిన పదేళ్లలో ఈ సంఖ్య ఏకంగా 78 శాతం పెరిగినట్లు పేర్కొంది. కాగా.. ఈ జాబితాలో హైదరాబాద్‌తోపాటు ఇండియా నుంచి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు కూడా ర్యాంకులు పొందాయి. ఫస్ట్ ప్లేసులో న్యూయార్క్ ఉండటం గమనించాల్సిన విషయం.

ఎన్‌హెచ్-44.. డిజిటల్..

హైదరాబాద్-బెంగళూరు నేషనల్ హైవే నంబర్-44ను డిజిటల్ హైవేగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 10 వేల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 512 కిలోమీటర్ల పొడవైన హైదరాబాద్, బెంగళూరు కారిడార్‌ను ఎంపిక చేసింది. దీంతోపాటు 13 వందల 67 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్‌వేని సైతం ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేశారు.

రంజాన్ ప్రత్యేక దుస్తులు

రంజాన్ పండగ సందర్భంగా అన్‌లిమిటెడ్ సంస్థ ప్రత్యేక దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. సెలబ్రేషన్ అండ్ ఫ్యాషన్ పేరుతో ఈ కలెక్షన్‌ని ఆవిష్కరించింది. ఇందులో మగవాళ్లకి, ఆడవాళ్లకి, పిల్లలకి కావాల్సిన ఫ్యాషన్ డ్రెస్‌లు ఉన్నాయి. ట్రెడిషనల్‌తోపాటు ట్రెండీ డిజైన్లలో వీటిని రూపొందించారు. తమ కంపెనీకి చెందిన అన్ని స్టోర్లలో ఈ బట్టలను విక్రయానికి ఉంచినట్లు అన్‌లిమిటెడ్ తెలిపింది. ప్రారంభ ధర 149 రూపాయలు మాత్రమేనని పేర్కొంది.

సర్వీసుల.. ఎగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం ఎగుమతుల విలువ 32 పాయింట్ ఎనిమిదీ సున్నా లక్షల కోట్ల రూపాయలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఎగుమతులు గణనీయంగా.. అంటే.. 42 శాతం పెరిగి 26 పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలుగా నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఎగుమతుల ప్రోత్సాహక మండలి తాజాగా అంచనా వేసింది. పోయినేడాది ఎగుమతులు లక్ష్యానికి మించి జరగటం విశేషం.

ఢిల్లీ యాపిల్ ప్రారంభం

ఢిల్లీలో మొట్టమొదటి యాపిల్ స్టోర్ ఇవాళ ప్రారంభమైంది. సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఈ స్టోర్‌ని లాంఛ్ చేశారు. ఇండియాలో ఈ కంపెనీ ఫస్ట్ రిటైల్ స్టోర్ మొన్న ముంబైలో అట్టహాసంగా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మన దేశంలో యాపిల్‌కి ఇది రెండో స్టోర్ కిందికి వస్తుంది. యాపిల్ సాకేత్‌గా పేర్కొనే ఈ స్టోర్‌ని ఓపెన్ చేయటం ద్వారా జాతీయ రాజధాని ప్రజలకు అత్యుత్తమ యాపిల్ ఉత్పత్తులను అందించబోతున్నామని, ఇది తమకెంతో సంతోషం కలిగిస్తోందని రిటైల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ హర్షం వ్యక్తం చేశారు.

‘‘యూపీఐ’’దే.. పైచేయి..

గతేడాది జరిగిన డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ ట్రాన్సాక్షన్లు పైచేయి సాధించాయి. మొత్తం లావాదేవీల సంఖ్య 87 పాయింట్ తొమ్మిదీ రెండు బిలియన్‌లు కాగా కాగా అందులో యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 74 పాయింట్ సున్నా ఐదు బిలియన్‌లని వరల్డ్ లైన్స్‌ లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్, మొబైల్, వ్యాలెట్ పేమెంట్లన్నీ డిజిటల్ లావాదేవీల కిందికే వస్తాయి. పోయినేడాది వీటన్నింటి ద్వారా జరిగిన లావాదేవీల విలువ 149 పాయింట్ 5 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో యూపీఐ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ల వ్యాల్యూ 126 లక్షల కోట్లుగా నమోదైంది.